ఎప్పటికో అంబరం నాలుగు చినుకులు రాలిస్తే
Telugu, కవితలు, తెలుగు, నా కవితలు November 5th, 2007
ఎప్పటికో అంబరం నాలుగు చినుకులు రాలిస్తే,
క్షోణి చేరకముందే ఆవిరైపొయినాయి.
ఉబికి ఉబికి వస్తున్న కన్నీరు,
దృగ్గోళం దాటకముందే మాయమైనాయి.
ఎన్నాళ్ళకో విరిసిన చిర్నవ్వు,
పెదవులు దాటకముందే వాడిపొయింది.
తీవ్ర ప్రయత్నంతో మొలకెత్తిన మొక్క,
బేడవిడువకముందే నేలలో కలిసిపొయింది.
పల్లకీలు బారులు తీసి పరుగెడ్తున్నాయి,
లోనున్నోరు మాత్రం ఇంచ్ కూడా ముందుకు వెళ్ళడంలేదు.
మఱ్ఱి చెట్టు నేలనంతా ఆక్రమిస్తుంది,
ఆకు కూడా రాల్చకుండా సారమంతా పీల్చేస్తుంది.
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి