గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను
Telugu, కథలు, కవితలు, తెలుగు, నా కవితలు November 5th, 2007
గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను
చేతికర్ర చేసే శబ్దాలు వింటూ
విరిసిన రంగుల చాపం చూస్తూ
పగటి వెన్నెలల, నల్లటి మబ్బుల -
చల్లటి చినుకులకు జలదరిస్తూ
గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను
అంగుళం పొడవు పసిపాము పిల్లల పరుగులు,
జోరుగాలిలో నేలపైని ఎండుటాకుల ఉరుకులు,
చిటారు శిఖరం నుండి లోయలోకి జారే కొండరాళ్ళు,
చాటుకు చేరే పక్షుల గుంపులు చూస్తూ, గమనిస్తూ -
గతకాలపు ఎత్తులవైపు అడుగులేశాను
సహవాసి సాధు సాహితీ సుస్వర సంపన్న పాటను,
అమృత బింధువులు నేలతో చేసే పరిచయాలను,
తోడుకై, జోడుకై జంతులు చేసే అరుపులను,
మహోత్సాహపు శిఖరం నుండి మహోద్వేగంతో-
మనసు చేసే కేరింతలను [...]
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి