పదిరోజుల క్రితం ముగిసిన లండన్ చలన చిత్రోత్సవంలో మన దేశానికి చెందిన ఐదు సినిమాలు ప్రదర్శింపబడ్డాయన్న సంగతి పాఠకులకు తెలిసే వుంటుంది. వాటిలో మూడింటి (Four Women, Last Lear, Voyeurs) గురించి ఈ సైట్లో ఇప్పటికే రాయడం జరిగింది. కానీ ఈ మూడు సినిమాలు ఇప్పటికే ప్రసిధ్ధిగాంచిన దర్శకులచే రూపొందించబడ్డవి. ఈ మూడు సినిమాల్లో Four Women మాత్రమే కొద్దో గొప్పో మన పరువు నిలబెట్టిందని నా అభిప్రాయం. కాకపోతే శివాజీ చంద్రభూషణ్ దర్శకత్వంలో వచ్చిన Frozen అనే సినిమా మాత్రం, “ఓహో భారతీయులు కూడా మంచి సినిమాలు తీయగలరేమో!” అని చాలా మంది అభిప్రాయబడేట్టు చేసిందని తప్పక చెప్పవచ్చు.


పూర్తిగా చదవండి