తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
annamaacharya, carnatic music November 16th, 2007ఈ కృతి వినడానికి కింది పంక్తులలో మొదటి వాటిపై CLICK చెయ్యండి.
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని
తెలిసితేమోక్షము - తెలియకున్న బంధము
కలవంటిది బదుకు -ఘనునికిని
అనయము సుఖమేడ -దవల దు:ఖమేడది
తనువుపై నాసలేని - తత్వమతికి
పొనిగితే బాపమేది -పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లవి - యోగికిని
తగినయమృతమేది - తలవగ విషమేది
తెగి నిరాహారియైన - దీరునికిని
పగవారనగ వేరి - బంధులనగ వేరీ
వెగటుప్రపంచమెల్ల - విడిచేవివేకికి
వేవేలువిధులందు - వెఱపేది మఱపేది
దైవము నమ్మినయట్టి - ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుడు - చిత్తములో నున్నవాడు
యీవలేది యావలేది - యితనిదాసునికి
in english:
telisitaemOkshamu - teliyakunna baMdhamu
kalavaMTidi baduku -ghanunikini
anayamu sukhamaeDa -davala du:khamaeDadi
tanuvupai naasalaeni - tatvamatiki
ponigitae baapamaedi -puNyamaedi karmamaMdu
vonara phalamollavi - yOgikini
taginayamRtamaedi - talavaga vishamaedi
tegi niraahaariyaina - deerunikini
pagavaaranaga vaeri - baMdhulanaga vaeree
vegaTuprapaMchamella - viDichaevivaekiki
vaevaeluvidhulaMdu - ve~rapaedi ma~rapaedi
daivamu namminayaTTi - dhanyunikini
SreevaeMkaTaeSvaruDu - chittamulO nunnavaaDu
yeevalaedi yaavalaedi - yitanidaasuniki
Vivarana : Nallani Chakravartula Krishnamacharyulu garu
తెలిస్తే మోక్షము తెలియక పొతే సంసార బంధము।బ్రతుకంతా ఒక కలేకాని నిజము కాదు।
శరీరము నశించును। ఇట్టి శరీరముపై ఆశ ఎందుకు ?అనే తత్వము తెలిసిన వారికి సుఖము లేదు ,దుఃఖము లేదు। కర్మ మాత్రమే చేయదగినది।కాని దాని ఫలమక్కరలేదు అని ఫలత్యాగము చేసే యోగికి పాపము లేదు,పుణ్యము లేదు
నిరాహారదీక్ష గలవానికి అమృతము లేదు,విషము లేదు । ప్రపంచమంతయు మిధ్య అని తెలిసి దానిపై వెగటు చెంది ప్రపంచమును వదిలిన వానికి పగవాడు లేడు , బంధువు లేడు।
వేల వేల విధులున్నాయి। ఈ విధులు చేసి ఏవేవో పొందుదామన్న తలంపు సాధారణముగా ఉంటుంది।రానిది రాకమానదు।పోనిది పోక మానదు అని దైవమునే నమ్మిన వానికి వెరపు లేదు మరపు లేదు। శ్రీ వేంకటేశ్వరుని చిత్తమున నిలిపి ఆయన దాసుడయిన వానికి ఈవల లేదు,ఆవల లేదు।
విశేషము
మొదటి చరణము రెండవ భాగము యోగస్థః కురు కర్మాణి సంగం త్యాక్త్వా ధనంజయసిధ్యసిధ్ద్యో సమో భూత్యా సమత్వం యోగ ఉచ్యతే = యోగమందున్న వాడవై ఫలసంగమును విడచి కర్మలను చేయుము।ఫలసిధ్ధికిని అసిధ్ధికిని సముడవై కర్మలను చేయుము। ఈ సముడగుటయే యోగము। ఆ యోగము కలవాడె యోగి।యోగికి పాపమేమున్నది,పుణ్యమేమున్నది?ఏదియు అంటదన్నమాట , ఇది గీతావాక్యము।
అన్నమయ్య ఈతత్వమును చెప్పిరి।
Subscribe to Feed
http://satyamsivamsundaram.blogspot.com/atom.xml
పూర్తిగా చదవండి