“ఒక చిన్న టర్న్ మీ పెద్ద కారు రూపాన్నే మార్చవచ్చు “. ఈ మద్య ఓపెళ్లికి బయల్దేరి తిన్నగా వెళ్లేవాళ్లం వెళ్లక త్వరగా చేరుకోవచ్చని ఓ టర్నింగ్ తీసుకుని వేరే దారి కో వెళ్లాం. ఆ దారి మా లాంటి వారితో నిండి పోయింది. ట్రాఫిక్ జాం, మద్యలో ఓలారీ, ఆటోలు, కార్లు, బైకులూ వెనక్కి రాలేం ముందుకీ వెళ్లలేం అదో పద్మవ్యూహం. అక్కడ మనం చేయడానికేమీ వుండదు ఏనాటికైనా ఇల్లు చేరాలని ప్రార్ధిసూ కూర్చోవటమే చివరకి కారుకి ఓ రెండు సొట్టలు, గీతలూ వేయించుకుని ఏవేవో సందులూ గొందులూ తిరిగి తిరిగి పెళ్లంతా ఐపోయాక భోజనాల వేళకి ఎలాగైతేనేం పెళ్లికి? చేరుకున్నాం.
సొట్టలు పడ్డ కారుని చూసినప్పుడల్లా ఆ టర్నింగే గుర్తుకువచ్చి మనసు విలవిల లాడి పోతోంది!

పెళ్లంటే గుర్తుకొచ్చింది సమానత్వం అని కబుర్లే కాని ఇప్పుడు కూడా 'కట్నం ' తీసుకుని (ఇచ్చి) పెళ్లిళ్ళు చేసుకుంటుంన్నారు. అమ్మాయి అబ్బాయి ఒకే చోట సమాన ఉద్యోగాలలో వుండికూడా! ఇదే విషయం అబ్బాయిదగ్గర మాట్లాడితే , ఆ డబ్బు తన కవసరం లేదు కాని కట్నం లేని పెళ్లంటే "నలుగురి లో నామోషీ " గా వుంటుందన్నాడు, అమ్మాయి అబిప్రాయమూ డిట్టో యే!

కట్న కానుకలు ప్రిస్టేజి ఇస్యూ ట ! ఇచ్చేవారికీ...., పుచ్చుకునేవారికీ....కూడా!

ఆ మద్య ఓ సారి హైద్రాబాద్ నుండి తిరుపతి వెళుతుంటే ఓ చోట హఠాత్తుగా చాలా వేగంగా ఓ అడవిపంది మాకారుకి అడ్దుగా వచ్చి తగిలింది. (అసలు అది పంది కాదేమో నని నా అనుమానం పంది అంత ఎత్తుగా వుండి అంత వేగంగా పరిగెత్తగలదా, అప్పుడే సన్నగా చిరుచీకటి మొదలైంది, కాని అందరూ అదేనన్నారు సరే) .
ఆ దెబ్బకి రేడియేటర్, హెడ్ లైట్స్ బద్దలై అక్క డ ఓ ఊర్లో రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. అక్కడి మెకానిక్ 'ఆహా రవితేజ (యాక్టర్) కారుకి కూడా ఇక్కడే, అచ్చు ఇలాగే జరిగింది నేనే బాగుచేశా' నన్నాడు. మీదెంత అదృష్టమో అన్నట్టు. అలా ఓ పంది వల్ల కూడా మీకారు రూపు రేఖలు మారవచ్చు.


అదీ సంగతి, ఇప్పటికింతే మళ్లీ ఏ కథో కబురో తీసుకుని మళ్ళీ ఎప్పుడైనా....
పూర్తిగా చదవండి