సూర్యాస్తమయపు సంక్లిష్ట వర్ణాల్ని ఖచ్చితంగా పదాల్లోకి తేగలిగినా కలుగని సంతృప్తి, ఆవేళ నీ చున్నీ రంగో పంజాబీ మీద డిజైనో డైరీలో నమోదు చేసుకుంటే కలుగుతుంది—ఎందుకు? నీ గురించి రాయడానికి, నిన్ను వర్ణించడానికి నెలవంకపైనా, వెన్నెలపైనా, పువ్వులపైనా, పక్షులపైనా ఆధారపడడం వ్యర్థమనిపిస్తుంది—ఎందుకు?

చెప్పనా ఎందుకో!—నువ్వే నడిచే సజీవమైన కవితవి; నీ వర్ణనకు వేరే కవిత్వం అనవసరమనిపిస్తుంది. నువ్వే నవ్వే తుళ్ళే ప్రకృతివి; నిన్ను పదాల్లో పెట్టడానికి మళ్ళా పకృతిని సాయమడగడం వెర్రితనమనిపిస్తుంది.

ఓ స్వయం సమర్థిత సౌందర్య సంవర్తమా నన్నిలా నీ సమాంతర ప్రపంచంలోకి లాగేసి ఏం చేయజూస్తున్నావు?
పూర్తిగా చదవండి