అనుకోని అతిథులు
ప్రకృతి January 8th, 2008
ఈ మధ్య మా కార్యాలయానికి అనుకోని అతిథులు వచ్చారు.
నాలుక్కాళ్ళ మీద నడుస్తూ ఇదే వయ్యారమన్నారు.
అదేమంటే కళ్ళింతంత చేసుకుని చూశారు.
ఆతిధ్యం స్వీకరించమని అర్ధిస్తే పచ్చగడ్డే పదివేలు, చాలు పొమ్మన్నారు.
నేను పని చేసే ఫేనుక్ రొబాటిక్స్ సంస్థ వ్యవస్థాపకులకి ప్రకృతి ఆరాధన అంటే చాలా ఇష్టమట. జపాన్ లో వారి ప్రధాన కార్యాలయం ఫ్యూజీ పర్వత పాదతలం దగ్గర ఉంటుంది. చాలా కిటికీల్లోంచి పర్వతం కనిపిస్తూ ఉంటుందిట. ప్రపంచ వ్యాప్తంగా వారి కార్యాలయాలన్నీ ప్రకృతికి దగ్గరగా, ఆహ్లాదకరమైన ప్రదేశాల్లో నిర్మించాలని వారి ఆదేశమట.
మా కార్యాలయ భవనం, పైనుంచి చూస్తే అర్ధచంద్రాకృతిలో ఉంటుంది. ముందు నుంచి చూస్తే మామూలు ఆఫీసు భవనం లాగానే ఉంటుండి. లోపలికి ప్రవేశించాక అర్ధచంద్రాకృతి వెంబడి సుమారు ఐదొందల గజాల పొడవున సాగే నడవా .. అవతలి పక్క గోడకి బదులు నిలువెత్తు అద్దాలు నడవా పొడుగునా .. ఆ అద్దాల్లోంచి కనపడే ఒక సన్నటి సెలయేరు, ఒక బుల్లి అడవి. ఆ అడవి లోంచి లేళ్ళు మా కంపెనీ లాన్‌లో గడ్డి నమలడానికి అప్పుడప్పుడూ వస్తూ ఉంటాయి. ఒకసారి నేను కొంత దూరం నించి ఎర్రనక్క (red fox) నొకదాన్ని కూడా చూశాను.
పూర్తిగా చదవండి