Download నవతరంగం
navatarangam, new wave, telugu cinema website, telugu websites, tollywood, ప్రత్యేకం January 28th, 2008
నవతరంగం వెబ్‌సైట్ మొదలుపెట్టి ఇప్పటికి నెల కావొస్తుంది. ఈ నెలలో దాదాపు 50 వ్యాసాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలపై పాఠకుల స్పందన కూడా బాగానే వుంది. భవిష్యత్తులో మరింత మంది రచయితలు నవతరంగం రాసే అవకాశాలున్నాయి. దాంతోనే మరింతమంది పాఠకులను ఈ సైటు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.
తెలుగు సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు చాలానే ఉన్నప్పటికీ, ఆ వెబ్ సైట్లలో తెలుగులో వున్నవి తక్కువే. నవతరంగం ద్వారా ఆ కొరత తీర్చాలన్నది మా ప్రయత్నం. అలాగే ప్రపంచంలోని అన్ని దేశాల సినిమాల గురించి సమీక్షలు, వ్యాసాలు, విశ్లేషణలు ఈ వెబ్సైట్ ద్వారా అందించాలన్నది కూడా మా ఆకాంక్ష.
అలాగే ఇక్కడ ప్రచురించిన వ్యాసాలు మరింతమందికి చేరాలన్న ప్రయత్నంలో ప్రతి నెలాఖరులో ఆయా నెలలో నవతరంగంలో ప్రచురించబడ్డ వ్యాసాలన్నీ pdf ఫార్మట్ లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కలుగచేస్తున్నాము. ఈ సదుపాయం కలుగచేయాలని సూచన చేసిన రాకేశ్వర్ రావు కి కృతజ్ఞతలు.
ఈ నెలలో వచ్చిన 40 వ్యాసాలు pdf ఫార్మట్ లో ఇక్కడ నుంచి డౌన్‍లోడ్ చేసుకోవచ్చు.
ఫిబ్రవరి నెలలో:
వచ్చే నెలలో నవతరంగంలో స్వరీయ B N రెడ్డి గారిపై ఫోకస్ చేయాలనుకుంటున్నాము. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలపై మీ సమీక్షలు, వ్యాసాలు పంపగోరిన వారు navatarangam[at]gmail[dot]com కు మెయిల్ చేయగలరు. B N రెడ్డి సినిమాలపై ఆసక్తి కరమైన రచనలు చేసిన వారికి విలువైన బహుమతులు కూడా ఇవ్వాలనే ఆలోచన వుంది. ఈ నెలలోనే కాదు రాబోయే నెలల్లో నవతరంగం కోసం అత్యుత్తమ వ్యాస రచన చేసిన వారికి బహుమతులు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అలాగే హైదరాబాదు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ విజేతల పరిచయాలు కూడా నవతరంగం లో ప్రచురించబడతాయి.
ఈ నెలలో జరిగే అతి పెద్ద సినిమా ఏవెంట్ అయిన ఆస్కార్ అవార్డుల రేసులో వున్న సినిమాలు, వ్యక్తుల గురించి కూడా కొన్ని వ్యాసాలు ప్రచురించే ప్రయత్నం చేస్తాము.
ఈ నెలలో నవతరంగం మరింత మంది పాఠకులను, రచయితలను ఆకర్షిస్తుందని ఆశిస్తూ….శెలవు
టీం @ నవతరంగం
పూర్తిగా చదవండి