యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా.

మొదటి సినిమా పేరు ’?’(question mark).

ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ విధంగా description వుంది.

The realistic journey of life that reaches the eventual, eventually.The intriguing fact is immortal for every soul that treads the path of life - an aethist,a fanatic or a believer.Should one call it the Soulful Sojourn or a Soulless journey? Whatever one wishes to call it, It ETERNALLY Is…. THE… “?”

బావుందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టి ఒక సారి చూడండి. వీలయితే మీ సలహాలు, సూచనలు అందచేయండి.

ఇక రెండో సినిమా పేరు ’౦’ (zero).
ఈ సినిమా వీధి బాలల గురించి ఒక డాక్యుమెంటరీ. వీధి బాలలు జీరో అయితే, వాళ్ళ పక్కన నిలబడి మనం తోడ్పాటు అందివ్వగలిగితే ఈ జీరో ఒక విలువ వుంటుంది అని ప్రబోధం చేయదలిచారు ఈ సినిమాలో. అంతా బాగానే వుంది కానీ ఈ సినిమా కొన్నిచోట్ల డాక్యుమెంటరీలా అనిపించలేదు. సీన్లు staged అని అనిపించాయి. విమర్శించడం పని గా పెట్టుకుని నేనీ మాట అనటం లేదు.నిజాన్ని ఉన్నదున్నట్టు చూపెట్టకుండా dramatize చేసి దాన్ని డాక్యుమెంటరీ అనడం వల్ల అసలుకే మోసం జరగొచ్చు.అలా నాకు మాత్రమే అనిపించి వుంటే నాదే తప్పు. చూడండి మీ అభిప్రాయాలు రాయండి.


పూర్తిగా చదవండి