రాత్రిపూట ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసీ మంచం మీదికి వాలుతూ, చీకటి మూసిన బెడ్‌రూంలో కాళ్లవైపు ఫ్లోరింగు తెల్లగా మెరుస్తూ టైల్స్‌ మీది డిజైన్‌ సైతం కనపడటం గమనిస్తాము. ఇంకో క్షణం పోయాక చూపులు తిన్నగా పైకి పోనిస్తే, లోకప్పు మీద ఫ్యాను రెక్కల నీడలు నల్లటి వలయాలుగా, గబ్బిలాల గుంపులాగా స్పష్టంగా తిరుగాడటం కనిపించి ఇంకా ఆశ్చర్యపోతాము.
పూర్తిగా చదవండి