రాజూ భాయ్
నాకు నచ్చిన పాటలు February 13th, 2008ప|| ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు , నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వై పోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు , మైమరపే ఇచ్చావు
నీలోనే కలిపావూ ….
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు , నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వై పోయావు
చ|| ఎటు చూసినా ఏం చేసినా ఏ దారిలో అడుగేసినా
నలువైపులా నాకెదురే వుందా మైనా మైనా
ఏ మబ్బులో దూకాడినా ఏ హాయిలో తేలాడినా
నాకింతగా ఆనంద వుందా నిన్నా మొన్నా
ఎవ్వరికైనా ఏ యెదకైనా ప్రేమలొ పడితే ఇంతేనా
ఔననుకొన్నా కాదనుకొన్నా
అనుకోనిదే జరిగిందిగా నా తీరు తెన్ను మారుతోంది గా ఆ ఆ ..
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు , నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వై పోయావు
చ|| చెలి చూపులో చిరు గాయమై మలి చూపులో మటుమాయమై
తొలిప్రేమగానే మొదలౌతున్నా కలలే కన్నా
నా శ్వాసలో తను లీనమై నా నిన్నల్లన్నీ శూన్యమై
ఈ జీవితం చెలికోసం అన్నా ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను చాలా దూరం నడిచాను
తియ్యని దిగులై పడి వున్నాను చెలి లేనిదే బతికేదెలా
ఏ ఊపిరైనా ఉత్తి గాలిలే
ఎవ్వరె నువ్వు నన్ను కదిపావు , నీ లోకంలోకి లాగావు
కన్నులు మూసి తెరిచేలోగా నా ప్రాణం నువ్వై పోయావు
తెలవారింది లేలెమ్మంటూ వెలుగేదో చూపావు
నాకూ ఓ మనసుందంటూ తెలిసేలా చేశావు
మెరుపల్లే కలిశావు , మైమరపే ఇచ్చావు
నీలోనే కలిపావూ ….

పూర్తిగా చదవండి