దేశం:ఇరాన్
దర్శకుడు: మజిద్ మజిది
కాలం:1999

ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే.

ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా అన్ని పనులు చేసుకోగలడు కూడాను. అతడికి బామ్మ, ఇద్దరు చెల్లెళ్ళు, ఇంకా తండ్రి ఉంటారు. తండ్రి అతడిని వదిలించికోవడానికి చూస్తూఉంటాడు. దానికి ఆ కుర్రవాడి బామ్మ ఒప్పుకోదు. ఆ తండ్రి ఏమి చెస్తాడు అనేదే కధ.

ఈ చిత్రంలో నటన అత్యద్భుతంగా ఉంది. మొహమ్మద్ పాత్రలో నటించిన కుర్రవాడు నిజంగా అంధుడే. ఈ చిత్రం చాలా అందమయిన ప్రదేశాలలో చిత్రీకరించారు. Camera పనితనం చాలా బావుంది.

కొన్ని దృశ్యాల చిత్రీకరణ చాలా చాలా బావుంది. అందులో ఒకటి, చిత్రం మొదటిలో కుర్రవాడు అతని తండ్రి గురించి ఎదురుచూస్తున్నపుడు, పక్కన ఉన్న చెట్టు మీద ఉన్న గూటిలోంచి పక్షిపిల్ల పడిపొతుంది. ఆ కుర్రవాడు పక్షిపిల్లని తీసి చెట్టు ఎక్కి ఆ పక్షిపిల్లని గూటిలో పెట్టడం. ఇంకొకటి climax సన్నివేశం. అంధుడైన కుర్రవాడు ప్రకృతితో ఎలా సంభాషించగలడొ చాలా బాగా చిత్రీకరించారు. నేను Bicycle Thief తర్వాత పాత్రలని అంత ఇష్టపడ్డ చిత్రం ఇది.

ఈ చిత్రంలో మరొక అంశం composed background సంగీతం లేకపొవడం. ప్రకృతి శబ్దాలే ఈ చిత్రంలో background సంగీతం. చలనచిత్ర ప్రేమికులందరు చూడవలసిన చిత్రమిది.


పూర్తిగా చదవండి