ఇంకో రెండు రోజుల్లో అస్కారు అవార్డులు ప్రకటించేస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డులు ఎవరికి దక్కచ్చో అన్న విషయం మీద నేను చేసిన ప్రిడిక్షన్.

ఉత్తమ నటుడు(Daniel Day-Lewis)

ఈ విభాగంలో Geroge Clooney, Daniel Day-Lewis, Johnny Depp, Tommy Lee Jones మరియు Viggo Mortensen లు వున్నారు. ఈ విభాగంలో అవార్డు Daniel Day-Lewis కే లభిస్తుందని నాకనిపిస్తుంది. Michael Clayton సినిమాలో George Clooney అతని మిగతా సినిమాలకంటే బాగానే చేసాడు. కానీ ఎక్స్ట్రార్డనరీ ఏమీ లేదు. Eastern Promises లో Viggo Mortensen కూడా బాగానే చేసాడు. కానీ Daniel Day-Lewis తో పోలిస్తే ఈయనకు అవార్డు రావడం కష్టమే. మిగిలిన రెండు సినిమాలు నేను చూడలేదు కాబట్టి నేనేమీ చెప్పలేను.

ఉత్తమ సహాయ నటుడు(Casey Affleck)

ఈ విభాగంలో Casey Affleck, Javier Bardem, Philip Seymour Hoffman, Hal Holbrook, Tom Wilkinson ఉన్నారు. మొదటి చూపులో Javier Bardem కి ఇచ్చెయ్యాలని అనిపించినా మరో సారి ఆలోచిస్తే No country for old men లో ఈయన నటన బావుంది కానీ ఒక నటునిగా వివిధ భావాలను వ్యక్తీకరించలేని one-dimensional పాత్ర పోషించడం వలన కష్టమేమో అనిపిస్తుంది. In to the wild(Hal Holbrook) మరియు Charlie Wilson’s war (Philip Seymour Hoffman) నేను చూడలేదు కాబట్టి మిగిలిన ఇద్దరిలో Casey Affleck కే నా ఓటు.

ఉత్తమ నటి(Laura Linney)

నా దృష్టిలో ఈ అవార్డు ఎంపిక కొంచెం కష్టమే. ఈ విభాగంలో Laura Linney, Ellen Page, Marion Cotillard, Julie Christie, Cate Blanchett వున్నారు. The Savages సినిమాలో ప్రదర్శించిన అధ్భుత నటనకు ఈమెకు తప్పక అవార్డు ఇవ్వొచ్చు కానీ Away from her లో జూలీ క్రిస్టీ, La Vie En Rose లో Marion Cotillard కూడా అధ్భుత నటనను ప్రదర్శించారు. Juno లో Elle Page ఫర్వాలేదు. కానీ మరీ ఆస్కారివ్వాల్సినంతేమీ లేదు. Elizabeth నేను చూడలేదు కాబట్టి నో కామెంట్స్.

ఉత్తమ సహాయ నటి(Saoirse Ronan)

Atonement చూసిన వాళ్ళెవరైనా Saorise Ronan నటనకు తప్పక అస్కార్ ఇవ్వాల్సిందే అని ఒప్పుకంటారు. ఈర్ష్య అసూయ భావాలు కలిగిన చెల్లెలి పాత్రలో ఈమె నటన సూపర్. ఈమెతో పాటు I am not there సినిమాలో నటించిన Cate Blanchett గట్టి పోటీ ఇవ్వొచ్చు.

ఉత్తమ సినిమాటోగ్రఫీ(The Diving Bell and the Butterfly)

ఈ అవార్డు ఈ సినిమాకే ఇవ్వాలని నా అభిప్రాయం. సినిమాటోగ్రఫీ విషయంలో నేను దృష్టికోణం (point of view) పిచ్చోడ్ని. కేవలం ఒక కన్ను మాత్రమే కదపగలిగన ఒక bed-ridden పేషంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చిత్రీకరించిన దృశ్యాలు న భూతో న భవిష్యత్ అని చెప్పవచ్చు. మిగిలిన సినిమాలు కూడా సినిమాటోగ్రఫీ విషయంలో బాగానే వున్నాఈ సినమా తో పోలిస్తే కష్టమే. ఇది కాదు అంటే నా రెండో ఓటు No Country For Old Men కే.

ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్(American Gangster)

70లలో అమెరికా ఎలా వుండేదో కానీ American Gangster చూస్తే ఇలా వుండేదేమో అనిపిస్తుంది. చాలా authentic గా అనిపించింది ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్షన్.

ఉత్తమ స్క్రీన్‍ప్లే - Original(The Savages)

ఈ సినిమాకే ఎందుకివ్వాలి అంటే American Beauty కి ఎందుకిచ్చారో అందుకు -)

ఉత్తమ స్క్రీన్‍ప్లే - Adapted(There Will Be Blood)

నేను Oil నవల చదవలేదు కానీ Paul Thomas Anderson ఇచ్చి ఒక ఇంటర్వ్యూ చదివాను. ఆయన చెప్పిన దానిబట్టి చూస్తే ఇది చాలా మంచి adaptation అనిపించింది.

ఉత్తమ యానిమేషన్ చిత్రం (Persepolis)

Ratatoulie లో యానిమేషన్ బావున్నా 2-D యానిమేషన్ లో ఒక పూర్తిస్థాయి సినిమా తీసి, అదీ ఒక సాంఘిక కథావస్తువు ఉపయోగిస్తూ ప్రేక్షకులను గంటన్నరపాటు కూర్చోబెట్టగలగడంలో పూర్తిగా సఫలమైన Persopolis కే నా ఓటు.

ఉత్తమ చిత్రం (No Country for Old Men/There Will Be Blood )

ఈ విభాగం ఈ సంవత్సరం చాలా బలహీనంగా వుందనిపిస్తుంది. Atonement, Michael Clayton, Junoఫర్వాలేదనిపించుకునే సినిమాలు మాత్రమే. ఉన్నవాటిల్లో చెప్పుకోదగ్గవి No Country for Old Men మరియు There will be Blood. ఈ రెండు మాత్రమే పోటి పడవచ్చు అవార్డు కోసం. ఈ రెండింటిలో ఒకటే ఎన్నుకోవాల్సి వస్తే నేను మాత్రం టాస్ వెయ్యాల్సిందే.

ఉత్తమ దర్శకుడు(Julien Schnabel)

న్యాయంగా అయితే ఈ అవార్డు Cohen Brothers కే రావాలి. కానీ సినిమా అనే ప్రక్రియలో అందరో ఫాలో అవుతున్న conventions పాటించకుండా Diving Bell and Butterfly సినిమాతో ఎంతో కష్టమైన ఐడియాని వినూత్నంగా తెరకెక్కించిన Julien Schnabel కి ఈ అవార్డు ఇవ్వడం ద్వారా సినిమా అనే ప్రక్రియలో కొత్త పధ్ధతులు సృష్టించే అవకాశం వుందనే నమ్మకం కలుగచేస్తుంది. అందుకే నా ఓటు Julien కి.

అస్కారు ఆవార్డుకి నామినేట్ అయిన సినిమాల పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు.


పూర్తిగా చదవండి