సంకారా
ప్రపంచ సినిమా, సమీక్ష February 27th, 2008దేశం: శ్రీలంక
కాలం: 2006
దర్శకుడు: ప్రసన్న జయకోడి
కళాకారుడు ప్రకృతిని చూసి స్పందిస్తాడు. సౌందర్యన్ని ఆరాధిస్తాడు అస్వాదిస్తాడు. అదే ఒక సన్యాసి భవబంధలనించి విముక్తి కోరుకుంటాడు. దేనికీ చలించకూదడదు అనుకుంటాడు. ఒక వేళ సన్యాసి కళాకారుడైతె అతడి పరిస్థితి ఎమిటి? అతడు అన్నిటిని త్యజించగలడా? అతడిలో జరిగే మనసిక సంఘర్షణ ఎలాంటిది? ఈ విషయం మీద తీసిన చిత్రమే సంకారా.
అనంద ఒక బౌద్ధ బిక్షువు. మంచి కళాకారుడు. ఒక పల్లెటూరులో బుద్ధిని గుడిలో చిత్రాలని పునరుద్ధరణ చెయ్యడానికి వస్తాడు. ఆ అందమయిన ప్రదేశం అతని మనసుని దోచుకుంటుంది. అతని బస ఎదురుకుండానే ఒక అమ్మయి ఉంటుంది. ఆ అమ్మయిని చూసి ఆకర్షితుడవుతాడు.
చిత్రాన్ని చాలా అందమయిన ప్రదేశలలో చిత్రీకరించారు. కమేరా పనితనం చాలా బావుంది. ఈ చిత్రం మంచి దృశ్యకావ్యం. అనందలో ఉన్న మామూలు మనిషి చూపించడానికి అతని alter egoని వాడారు. అతడు పునరుద్ధరణ చెయడానికి వచ్చిన చిత్రాల విషయం కూడా temptations. ఆ చిత్రాలకి అతని అనుభవాలకి ఉన్న అనుభంధం చాలా బావుంది.ఈ చిత్రం ఈ దర్శకుడికి మొదటి చిత్రం కావడం విశేషం.
చిత్రం చూసేవాళ్ళకి కొంచం abstractగా కనిపించవచ్చు. నాకు మాత్రం చాలా నచ్చింది. మీకు ఇలాంటి చిత్రాలు నచ్చితే తప్పక చూడండి.
పూర్తిగా చదవండి