MSN ఇండియా వెబ్‍సైటు తెలుగులో వుందని తెలుసు గానీ పెద్దగా ఎప్పుడూ చూడలేదు. ఈ రోజు చూస్తుంటే కొన్ని ఇంటర్వ్యూలు కనిపించాయి.

“తెలుగు సినీ సాహిత్యం-భాషా సాహిత్య విలువలు” సదస్సులో పాల్గొన్న పరుచూరి “సినిమాల వల్ల జనం చెడిపోరని, సామాజిక విలువలే వారిని ప్రభావితం చేస్తాయని” అంటున్నారు.

శ్యామ్ బెనగల్ తన ఇంటర్వూలో “పెద్ద హీరోలతో సినిమాలు తీయాలంటే ఇమేజ్ చట్రం అడ్డు వస్తుంది.” అంటున్నారు.

పూరీ జగన్నాధ్ తన ఇంటర్వ్యూలో “నేను గనక సమాజాన్ని చైతన్య పరిచే సినిమా చేస్తే ధర్నాలు చేసి సినిమాను ఆపించేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నా సబ్జెక్టులో అంత పవరుంటుంది. అవి చూస్తే చాలా ప్రశ్నలు ఉద్భవిస్తాయి. దాన్ని ఎవ్వరూ తట్టుకోలేరు” అంటున్నారు.


పూర్తిగా చదవండి