ఎవరు హీరో
Kathalu, Telugu, కథలు, తెలుగు March 6th, 2008
.
.
.
.
a brief intro before you start reading my latest story...
nagesh oka maanchi paataku dance vesi tana fiancee ki dedicate chesadu...
nagesh anta chesinappudu nenu oka chinna katha raasi adi naa blog chusevallaki ankitam ivvalena..anduke ee katha raasa....enjoy!!!
idigondi nagesh chesina dance di link
___________________________
నగేష్: తండు, ఎలా ఉంది నా డాన్స్?
తండు: కేక బాబాయ్... నీకేటి ఇరగదీసావు.. ఏంటి సంగతులు?
నగేష్: మామా, హీరోగా ఎమన్నా చెయ్యొచ్చంటావా?
తండు: చెయ్యొచ్చా అన్న సందేహమెందుకు, నా లాంటి దర్శకుడిని నమ్ముకో చాలు...
నగేష్: నీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను మామా..
తండు: వార్నీ, అప్పుడే డైలాగులు వదులుతున్నావు కదా... ముందు ముప్పై, తర్వాతొక అరవై ఇచ్చుకో, నీకు చుక్కలు చూపిస్తా..సారీ, నిన్ను చుక్కల్లో చూపిస్తా...
నగేష్: తప్పకుండా బాబాయ్, తొక్కలో తొంబై లక్షలదేముంది..నన్ను కెమెరా ముందుంచు చాలు...
****
రెండు నెలల్లో సినిమా రెడీ...సినిమా ప్రివ్యు చూడటానికి అందరూ వచ్చారు(సెంట్రల్ మిషిగన్ తెలుగు గుంపు, భవన్స్ గుంపు, సంత(walmart)లో జనాలు, షాలూ బేబ్..)
ప్రివ్యు మొదలయ్యింది...
తారాగణం: బొట్టు బాషా, నాట్య నాగు, నటీష(తొలి పరిచయం), శాలు(అతిధి పాత్ర).....
కెమెరా: ఫ్రేమ్ ఫణి
కొరియోగ్రఫీ: మాస్ మేస్త్రీ
కథ, స్క్ర్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: తండు
నిర్మాత: నాట్య నాగు(నగేష్)
సీన్1
నా గిటార్ తీగ తెంచి నేను మ్యూజిక్ ప్లే చెయ్యకుండా అయ్యానని తెగ సంబరపడి పోయావు కదరా, ఇప్పుడు చూడరా, నేను డాన్స్ వేస్తే అర క్షణం కూడా నన్ను ఆపగలిగే వాడు ఈ భూమ్మీదే లెడు రా...
***
అదేంటి తండూ, నాలో ఆవేశం చూపిస్తావనుకుంటే ఈ సీన్ ని లాంగ్ షాట్ లో చూపించావు?
ఏం లేదు నగేష్, అది తీసేప్పుడు ఎండ ఎక్కువగా ఉంది..నీకు తెగ చెమటలు పట్టాయి.. ప్రేక్షకులు నువ్వు భయపడుతూ డైలాగ్స్ చెప్పావేమో అని అనుకునే ప్రమాదం ఉంది, అందుకే అలా తీసా...
అలాగా, అయితే పర్లేదులే తండూ..
సీన్2
హీరో ఒకరికి ప్రోపోజ్ చేస్తాడు...
"SHA SHA SH SHALUUUU, I LUV UUUUU"
"సారీ, నాకు పెళ్ళి అయ్యింది..వచ్చే జన్మలో ప్రయత్నించు..."
***
ఈ సీన్ ని కూడా లాంగ్ షాట్ లో చూపించావేంటి తండు?
నువ్వు, నీ చేతిలో పువ్వు, steadyగా లేవు..అందుకే షాట్ అలా తీయాల్సొచ్చింది...
అప్పుడు తుఫాన్ లాంటివేమీ లేవు కదా, అయినా ఎందుకు steadyగా లేవు?
ప్రకృతి ప్రశాంతంగానే ఉంది, నీలోనే రేగిందేమో ఎదో తూఫాను...
సారీ తండు, పువ్వు పట్టుకోవడము, రివ్వు రివ్వున ఎగిరి ఒక అందమైన అమ్మాయి చేతికివ్వడము పెద్దగా అలవాటు లేదు కదా, అందుకే అలా అయ్యింది..
సీన్3
హీరో తన ప్రేయసి(One-Side Love)ని ఎవరో కామెంట్ చేసారని తెలిసి కుమ్మెయ్యడానికి పధకం వేసి అమలు పరుద్దామని బయలుదేరబోతుంటే,
"ఉండన్నా, బొట్టు పెడతా" అంటూ అడ్డు పడుతాడు బొట్టు బాషా...
ఇదీ లాంగ్ షాటేనా తండూ, ఇక్కడేమయ్యింది?
మన బొట్టు బాషాగాడు జనాలకి బొట్టు పెట్టీ పెట్టీ ఊర్లో ఉన్న కొట్లన్నీ ఖాలీ చేసాడు..బొట్టు లేదని నీకు బొట్టుబిల్ల పెట్టి వదిలాడు విలన్ల మీదికి... అందుకే అలా తీయాల్సొచ్చింది..అంతే కాదు, పక్కనుంచి నటీశ నిన్ను చూస్తుందని ప్రేక్షకులకి తెలియాలని అలా పెట్టా... నిన్ను పేమించడం కూడా మొదలు పెడుతుంది అప్పటినుంచి...
సరెలే తండూ, కనీసం నటీషని పెట్టి కవర్ చేసావు...
సీన్4
హీరో హీరోయిన్‌ని పెళ్ళి చేసుకుని ఫిజి దీవులకు వెళ్తాడు హనీమూన్‌కి...
స్వర్గం నుంచి ఊడిపడ్డ స్వప్నసుందరిలా ఉన్న హీరోయిన్‌ని కొరుక్కు తినేలా చూస్తారు కండలు తిరిగిన నల్ల విలన్‌లు ...
హీరోకి నచ్చదు..పెద్ద ఫైట్ అవుతుంది...
***
తండు, ఈ సీన్‌లో నేను విలన్‌లని కొడుతున్నట్టు లేదు, విల్లన్‌లే నన్ను తరుముతున్నట్టు ఉంది, ఏం జరిగిందక్కడ?
సరిగా పసిగట్టావు నగేష్..మన ఫ్రేమ్ ఫణి గాడు సరిగ్గా కెమెరా ఆన్ చేసే టైంకి నువ్వు విలన్‌లని వీరబాదుడు బాదడం అయ్యింది, విలన్‌లు నిన్ను తరమడం మొదలయ్యింది... సహజంగా ఉంటుందని సీన్ ని అలాగే షూట్ చేసాం...
సీన్5
తీన్‌మార్ సీన్‌లో నేను లేనేంటి తండూ?
31వ తేదీన అర్ధరాత్రి నీకోసం వెతికితే TIMES SQUAREలో నువ్వు హీరోయిన్ ప్రేమాయణం లో మునిగిపోయారు..కదిలించడం ఎందుకులే అని మన మాస్ మేస్త్రీకి అవకాశం ఇచ్చా...
మూడేళ్ల తర్వాత...
ఇండియా, ఫిజీలో ఎదురు దెబ్బలు తగిలినా, USకి వచ్చి స్థిరపడ్డ నగేష్ మన యువతరానికి ఒక స్పూర్థి...సినిమా హిట్ అవ్వడం వల్ల వచ్చిన డబ్బుతో USలొ జల్సా చేస్తున్నారు...
***
TST Inc. (Times Square Teenmaar Inc.)తో మాస్ మేస్త్రీ జనాదరణ పొందుతున్నాడు...
***
USలో బొట్టుకేమి కొదవ లేకపోవడంతో బొట్టు బాషా కాస్త బొట్టు బాబా గా అవతారమెత్తి దేసీల్లో ప్రసిద్దికెక్కారు...
అప్పుడప్పుడు Japan, Germany నుంచి కూడా భక్తులు వస్తూఉంటారు...
***
...........::: శుభం :::...........
సినిమా సూపర్ గా పాపులర్ అయితే మీడియా వదులుతుందా, ప్రశంసల మాట దేవుడెరుగు, ప్రశ్నల వర్షం మాత్రం ఆగదు...ఇదిగోండి మచ్చుకి కొన్ని...
మీరు సినిమాని ఇంత తక్కువ టైంలో ఎలా పూర్తె చెయ్యగలిగారు?
>>నా సినిమాలో ప్రతీ షాట్ మొదటి టేక్‌లోనే ok చేసేంత గొప్పగా తీసా. అందుకే అనుకున్నదానికన్నా తొందరగా పూర్తి చెయ్యగలిగాను.
శుభం కార్డ్ పడేదాకా ప్రేక్షకులు లేవకుండా ఎలా కూర్ఛోబెట్టారు?
>>చాలా simple, ప్రతి సీట్ మీద కొంచం glue వేసాము..హహహ.. just kidding..
>>1)విశ్రాంతి తీసేసాము...
>>2)"లేచారో లక్ష గోవిందా" campaign జనాదరణ పొందేలా జాగ్రత్తలు తీసుకున్నాము...
సినిమాలో కేవలం ఒక్క పాట, అదీ చివర్లో పెట్టడంలో మీ ఉద్దేశం?
>>సినిమా కమర్శియల్‌గా సక్సెస్ అవ్వాలంటే మాస్‌ని అలరిస్తూ శుభం కార్డ్ పడెయ్యాలన్నది ఒక కాన్సెప్ట్...అందుకే అలా చేసాను.
మీ సినిమాగురించి మీమాటల్లో కాస్త చెప్తారా? "ఎవరు హీరో" టైటిల్‌ని ఎంపిక చెయ్యడానికి ఏదైనా బలమైన కారణం ఉందా?
>>ఒక వైవిధ్యమైన youth-cum-family-cum-mass-entertainerని ప్రేక్షకులకు అందించాలన్నది నా కోరిక...సినిమా చూసిన వాల్లకి అదొక పజిల్‌లా ఉండాలి..సినిమా మొత్తం చూసాక వాళ్ల తెలివితేటలని ఉపయోగించి అదృష్టాన్ని పరీక్షించుకునే చక్కటి అవకాశం ఉండాలి. సినిమా ఎలా ఉంది అని ఎవరైనా అడిగితే "ఏముంది అందులో తొక్క, యాబై బొక్క" అని పెదవి విరిచే వాళ్లు ఎక్కువయ్యారు..అందుకే ఇలాంటి సినిమా తీసాము..సినిమా చూస్తున్నంతసేపు హీరో ఎవరా అని ఆసక్తితో చూడాలి..లక్షాధిరారులు అయ్యే అద్బుతమైన అవకాశం ఇది కనుక తెగ చూసారు...కమర్శియల్‌గా పెద్ద సక్సెస్ చేసారు...
******
పూర్తిగా చదవండి