అకిరా కురొసావా-పరిచయం
Akira Kurosawa, introduction to Akira kurosawa, japanese films, ఆకిరా కురొసావా, నవతరంగం, ప్రపంచ సినిమా, ప్రముఖులు, ఫోకస్ March 10th, 2008
ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి ఎన్నో కళాఖండాలకు ప్రాణం పోసారు అకిరా కురొసావా.
1910,మార్చి 23 వ తేదీన, జపాన్ లోని టోక్యో లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు అకిరా కురొసావా . ఏడుగురు సంతానం కలిగిన కుటుంబంలో ఆఖరి వాడు అకిరా కురోసావా. ఈయన పుట్టే నాటికి ఒక సోదరి పెళ్ళయ్యి, మరో సోదరుడు ఉద్యోగరీత్యా ఇళ్ళు వదిలి వెళ్ళిపోగా, మరో సోదరుడు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు. దాంతో ముగ్గురు అక్కలు ఒక అన్నలతో తన చిన్నతనం గడిపిన అకిరా కురొసావా, తన నాలుగో తరగతిలో వుండగా మరో సోదరిని కోల్పోయాడు. అందుకే కాబోలు death అనే concept ని తన సినిమాల్లో అధ్యయనం చేశారనిపిస్తుంది.
చిన్నతనంలో ఎక్కువగా తన అన్న హీగో కురొసావా తో తిరుగుతూ గడిపిన జీవితం అకిరా కురోసావా జీవితంలోని కళాకారునికి పునాదులు ఏర్పరిచాయి. ఆ రోజుల్లో మూకీ సినిమాలకు వ్యాఖ్యాత (బెంషీ)గా వ్యవహరించే హీగో తోకలిసి చిన్ననాడే ఎన్నో సినిమాలను చూసే అవకాశం కలిగింది అకిరా కురొసావాకు. అంతేకాకుండా అకిరా కురొసావా తండ్రి పాశ్చ్యాత్య సినిమాలనూ చూడాలని తన కుటుంబ సభ్యులను ప్రోత్సాహించడంతో తన 19వ యేటికే దాదాపు వందకు పైగా సినిమాలను చూసి సినిమాలంటే ఒక ప్రత్యేక అభిమానం పెంచుకున్నాడు అకిరా కురొసావా.
1929 లో ఇల్లు వదిలి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన అకిరా కురొసావా సాహిత్యం, చిత్రకళలను అభ్యసించాడు. సాహిత్యంలో ముఖ్యంగా Dostoevsky, గోర్కీ లంటే ఇష్టపడేవాడు అకిరా కురొసావా. ఇదే సమయంలో “Proletarian Artists’ League” చేరి కొన్నాళ్ళూ అక్కడా ఇక్కడా తిరుగుతూ లక్ష్యం లేని జీవితం గడిపిన తర్వాత కొన్నాళ్ళకు తన సోదరుడు హీగో ఆత్మహత్య చేసుకోవడంతో తన జీవితంకూడా అలా కాకూడదన్న నిర్ణయానికి వచ్చాడు. తన సోదరునే అనుసరిస్తూ చిన్ననాటి నుండి జీవితం గడుపుకుంటూ వచ్చిన అకిరా కురొసావా, వారిద్దరి మధ్య సారూప్యం గురించి చెప్తూ “I saw him as a negative strip of film that led to my own development as a positive image” అనే వారు.
పూర్తిగా చదవండి