సూరజ్ కా సాత్వా: ఘోడా-సమీక్ష
భారతీయ సినిమా, సమీక్ష March 19th, 2008
శ్యాం బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో విభిన్న చలన చిత్రాల్లో ’సూరజ్ కా సాత్వా ఘోఢా’కు ఒక ప్రత్యేక స్థానం వుంది.కథా పరంగా శ్యాం బెనెగల్ చిత్రాలు అన్నీకూడా సమకాలీన సామాజిక పరిస్థుతులకు అద్దం పడుతున్నట్టే ఈ సినిమా కూడా ఉత్తర భారత దేశంలోని ఒక చిన్న పట్టణంలోని ప్రజల జీవితాల్ని మన కళ్లకు కట్టినట్టుగా దృశ్యీకరించినప్పటికీ ఈ సినిమాలోని వైవిధ్యం కథలో మాత్రమే కాకుండా కథనంలో కలిగి వుంటుంది.
చెప్పుకోడానికి ఈ సినిమాలో మొత్తం మూడు కథలు. అన్నీ ప్రేమ కథలే. మానిక్ అనే యువకుడు ఒక సాయంత్రం తన ఇంటిలో కూర్చుని మరో ముగ్గురు స్నేహితులతో బాతాఖానీ కొడ్తూ చెప్పే కథలు ఇవి. మొదటి కథలో పక్కింటి అమ్మాయితో ప్రేమ వ్యవహారం, రెండో కథలో పక్కింటి కుర్రాడి కి త్వరలో భార్య కాబోతున్న యువతితో ప్రేమ వ్యవహారం, మూడో కథలో పక్కింటి పెద్దాయన మనసు పారేసుకున్న యువతితో ప్రేమ వ్యవహారం గా ఈ కథలు నడిచినప్పటికీ ఈ కథలు కేవలం మానిక్ ప్రేమ వ్యవహారాల చుట్టూతా మాత్రమే పరిభ్రమించకుండా కథలోని వివిధ పాత్రల వ్యక్తిత్వాన్ని ఈ సినిమా ప్రతిబింబింపజేస్తుంది.
ఈ మూడు కథల్లోని ముగ్గురు నాయికలను సమాజంలోని మూడు వేర్వేరు స్థాయిలకు (పేద,మధ్య తరగతి, ఉన్నత) చెందిన కుటుంబాలనుంచి వచ్చినట్టుగా చూపించడం ద్వారా ఆయా తరగతుల ప్రజల ఆలోచనా శైలిని ఈ సినిమా ద్వారా తెరకెక్కించడం జరిగిందనుకుంటూన్నాను. అలాగే ఈ కథల్లోని నాయకుడు మానిక్ ను ఒక్కో కథలో ఒక్కో వయసు వాడిగా కూడా చూపించడం ద్వారా మగవాళ్ళ మనస్తత్వాన్ని గురించి కూడా వివిధ కోణాల్లో చూడగలుగుతాం.
గతంలో ’మారుతున్న సినిమా కథనం’ అనే వ్యాసంలో చెప్పినట్టుగా ఈ సినిమాలో కథనం సరళ రీతిలో కాకుండా విరళంగా సాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన దేశంలో వచ్చిన అతి కొద్ది నాన్-లీనియర్ సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమా రావడానికి 35 ఏళ్ళకు పూర్వమే హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన ’ముసాఫిర్’ సినిమా ఇలాంటి ప్రక్రియనే అవలంబించినప్పటికీ ఆ సినిమాలో వున్న మూడు కథల్లోని పాత్రలు ఆయా కథలకు మాత్రమే పరిమితమై వుంటాయి. కానీ ’సూరజ్ కా సాత్వా ఘోడా’ లో అలా కాదు. వుండడానికి ఈ సినిమాలోను మూడు కథలు వేర్వేరుగా వున్నప్పటికీ ఈ కథల్లోని పాత్రలు దాదాపు అన్ని కథల్లోనూ వుంటాయి. కాకపోతే ఒక కథలో ముఖ్య భూమిక పోషించిన పాత్ర మరో కథలో అంత ప్రాముఖ్యం లేని పాత్రలో కనిపించవచ్చు. అలాగే మరో ముఖ్య విషయం ఏంటంటే ఒక కథలో జరిగిన ఒక సన్నివేశం మరో కథలోనూ వేరే దృష్టి కోణంలో ప్రత్యక్షమవుతుంది.
ప్రఖ్యాత హిందీ నవలా రచయిత ధరమ్వీర్ భారతి రచించిన ’సూరజ్ కా సాత్వా ఘోడా’ అనే నవల ఆధారంగా రూపొందించబడ్డ ఈ సినిమా కి (అలాగే ఈ నవలకి) ఆ పేరు ఎందుకు పెట్టివుంటారో అనే విషయం గురించి చాలా మంది చాలా విధాలుగా అబిప్రాయాలు వ్యక్తపరిచినప్పటికీ ఈ సినిమాని(కనీసం రెండు మూడు సార్లైనా) చూడడం ద్వారా ఆ విషయం ప్రేక్షకులకు సులభంగానే అర్థమవుతుందనిపిస్తుంది.
పల్ప్ ఫిక్షన్, రషోమొన్ అభిమానులు తప్పక చూడవలసిన సినిమా ఇది.
ఈ సినిమా గురించి శ్యాం బెనెగల్ అభిప్రాయం:
“…for a long time I’d been feeling that cinema had a kind of limitation. It’s such a concrete kind of medium, the semiotics and language. When you write, movement in time and space is so easy, just as when you think. But in the cinema there are concrete structures less easy to work with. So I wanted to use stories that were happening simultaneously, and to get that sense not necessarily by using cross-cutting. Here was this novel that Dharmvir Bharati had written in the mid-50s, considered a great breakthough novel in the Hindi language, and that was excellent material. It’s a cycle of four stories that the central character tells, and he’s the protagonist in each of them, but his self-perception in each is different from how he sees himself in the other stories. In one he sees himself as a pre-pubescent boy, in another as an adolescent, in another as an adult… Then suddenly you discover that these events are actually taking place simultaneously. I found this very interesting material to work with. I’ve always thought that people’s perceptions freeze at certain times. Like with your parents - to them you stop at a certain age. For instance, I think my father always saw me as an 8-year-old boy, even when I was pushing 50. The same thing with one’s mother: they don’t see you as a grown adult; they place you in a position they find most attractive. We do the same to everybody else; we hold on to certain characters we like.
పూర్తిగా చదవండి