మీరు గమనించే వుంటారు, ఈ మధ్యనే ’సలీమ్ లంగ్డే పే మత్ రో’ సినిమా సమీక్ష తో పాటు, ఆ చిత్ర దర్శకుడు సయీద్ మీర్జా గురించి పరిచయం వ్యాసంతో పాటు ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ సినిమాను ఉచితంగా ఎలా చూడొచ్చో కూడా తెలియచేయడం జరిగింది. ప్రతి నెలా కనీసం ఇద్దరు భారతీయ దర్శకులను, వారి చిత్రాలను ఈ విధంగా పరిచయం చేస్తూ వీలైతే ఆయా సినిమాలను ఆన్‍‍లైన్లో ఎలా చూడొచ్చో కూడా తెలియచేసే ప్రయత్నం చేయాలని వుంది.

అ ప్రయత్నంలో భాగంగా ఈ మధ్యనే ప్రముఖ దర్శకుడు ’శ్యాం బెనెగల్’ గురించి పరిచయ వ్యాసం ప్రచురించబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘సూరజ్ కా సాత్వాఘోడా’ సినిమా సమీక్ష కూడా ప్రచిరించడం జరిగింది. ఎంతో ఆసక్తి కరంగా సాగే ఈ సినిమా నెరేటివ్ పరంగా ఎంతో వైవిధ్యంగా వుంటుంది. ప్రపంచ సినిమాలంటే ఆసక్తి కలిగిన వాళ్ళు, మన భారతీయ సినిమా అంటే చిన్నచూపు ఉన్నవాళ్ళు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

ఆసక్తి వున్నవాళ్ళు ఈ సినిమాను www.jaman.com లో చూడగలరు.jaman లో నమోదు చేసుకోవడం ద్వారా మొదటి రెండు సినిమాలు ఉచితంగా చూశే అవకాశం వుంది కనుక ఈ అవకాశం సద్వినియోగపరుచుకోగలరు.


పూర్తిగా చదవండి