anthonyminghella.jpgఅస్కారు అవార్డు గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ సినిమా దర్శకుడు Anthony Mighella ఈ వారం లండన్ లో మరణించారు. ’Turly, Madly, Deeply’ చిత్రం ద్వారా చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టిన Anthony Minghella గతంలో ‘English Patient’ సినిమాకి గానూ ఉత్తమ దర్శకునిగా ఆస్కారు అవార్డు అందుకున్నారు. ’English Patient’ అనే నవల ఆధారంగా నిర్మింపబడ్డ ఈ సినిమాకి ఒక ప్రత్యేకత వుంది. సాధారణంగా ఏదైనా ప్రఖ్యాతి గాంచిన నవల ఆధారంగా సినిమా నిర్మించినప్పుడు అది నవల అంత బాగా దృశ్యీకరించబడలేదనే విమర్శలు వస్తుండడం సహజమే! కానీ నాకు తెలిసినంతవరకూ ’English Patient’ సినిమా దాదాపు నవలా రచయిత Michael Ondaatje విజన్ కి సరితూగేలా వుందంటే అది Anthony Minghella అధ్భుత పనితనమే అని చెప్పొచ్చు.

అలాగే ఈయన దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా Talented Mr Ripley. ఇది కూడా ఒక నవల ఆధారంగానే రూపొందించబడింది. ఈయన చనిపోయేనాటికి మరో ప్రఖ్యాత నవల ’The No.1 Ladies Detective Agency’ను సినిమాగా మలిచి పోస్ట్ ప్రొడక్షన్ పనిలో వున్నారు.

Anthony Minghella మరణం బ్రిటిష్ సినిమా పరిశ్రమకు తీరని లోటు!

ఫిల్మోగ్రఫీ:

1990 Truly, Madly, Deeply
1993 Mr. Wonderful

1996 The English Patient
1999 The Talented Mr. Ripley

2000 Play
2003 Cold Mountain
2006 Breaking and Entering

2008 The No. 1 Ladies Detective Agency

Anthony Minghella గురించి మరిన్ని విశేషాలు:

వీకిపీడీయా వ్యాసం

ప్రొఫైల్

ఇంటర్వ్యూ


పూర్తిగా చదవండి