సాక్షి - నిజమైన సాక్షా లేక దొంగ సాక్షా?
NEWS, Telugu, andhra, paper, saakshi March 24th, 2008సాక్షి తెలుగు దిన పత్రిక ఎట్టకేలకు మొదలయ్యింది. మా’ టివి లో ప్రారంభోత్సవ కార్యక్రమం ని చూసాను. మాట్లాడిన వారంతా, సాక్షి మీద / జగన్ మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకంగా ఉన్నారనిపించింది. పత్రిక మొదలు కాకముందే 15 లక్షల మంది చందాదారులుగా చేరారని అనధికార వార్త. అదే సమయం లో ఈనాడు కి 10 లక్షలు మరియు అంధ్రజ్యోతి కి 5 లక్షల మంది చందాదారులట! మొన్నీమధ్యనే మొదలైన సూర్య పత్రిక 1 లక్ష దగ్గర చతికిల పడిందట. ఈ సూర్య పత్రిక వెబ్ సైట్ కోసం Google లో చాలా వెతికాను. ఒక లింక్ (సూర్య తెలుగు డైలీ) దొరికింది కానీ ఇది నిజమైన లింక్ అవునో కాదో ఇంకా తెలియదు. సాక్షి పత్రిక అంతా రంగుల పేజీలే కాబట్టి అందరికీ ఆకర్షణ గానే వుండవచ్చు, మొదటి సంవత్సరం కాబట్టి కొద్దిగా నైనా తటస్తం గా వుండవచ్చు (నాకైతే ఏ మాత్రం నమ్మకం లేదు!). గత 4 ఏళ్ళ పరిపాలనను బట్టి, నా వుద్దేశం ప్రకారం వీరికి అధికారం చేతిలో వుంది కాబట్టి చందాదారుల సంఖ్య పెంచుకోవడం పెద్ద సమస్య కాదు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని చందాదారులను పెంచుకోవాలంటే దానికి చాలా మర్గాలున్నాయి. ఇకముందు మీ సాక్షి చందా నంబరు (బహుశా కాంగ్రేస్ లేదా ఈ ప్రభుత్వం వున్నంత వరకు) చాలా ముఖ్యం కావచ్చు, ఉదాహరణకి, మీ గ్యాస్ రీఫిల్ కి, ఇందిరమ్మ గృహానికి, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ లకు మొదలైనవాటికి (ష్!!! అంతా అనధికారికంగానే...). Any way, best of luck Mr. Jagan and letz hope for good. ఏదేమైనా మా’ టివి లో C.P.I నారాయణ గారు చెప్పినట్టు ఈ "సాక్షి" పత్రిక కోర్టు ల దగ్గర దొరికే దొంగ సాక్షుల లాగ దొంగ సాక్ష్యం చెప్పదని ఆశిద్దాం.
Update: Updated with Sakshi website address సాక్షి
పూర్తిగా చదవండి