కాలం:1985

భాష:హింది

దర్శకుడు:గుల్జార్

నటులు: నసీరుద్దిన్ షా, రేఖ, అనురాధ పటేల్

మీరు ఏ గుల్జార్ అభిమానిని అయినా మీకు చాల నచ్చిన చిత్రం ఎమిటి అని అడిగితే ఎక్కువగా వచ్చే సమాధానం ఇజాజత్. నేను ఈ చిత్రం మొట్టమొదట కాలేజిలో ఉన్నప్పుడు చూసాను. అప్పుడు చిత్రం బావుంది అని మాత్రం అనుకున్నాను. తర్వాత మళ్ళి మూడెళ్ళ క్రితం చూసాను. అప్పుడు ఈ చిత్రం ఒక కళాఖండం అనిపించింది.

కధ: దీనికి ఆధారం ఒక బెంగాలీ కధ. ఒక వర్షం రోజు రాత్రి మహేన్, సుధ train stationలో కలుసుకుంటారు. వారిద్దరు ఒకప్పుడు భార్యాభర్తలు. వారి దంపత్య జీవితాన్ని, విడాకులకి దారితీసిన పరిస్థితులని చర్చించుకుంటారు. కధాకాలం ఒక రాత్రి. వారి చర్చలు, Flashbackలో వారిద్దరి దాంపత్య జీవితాన్ని చూపెడతారు. చిత్రం non-linear formatలో సాగుతుంది.

ఈ చిత్రం బాగా నచ్చడానికి కారణం పాత్రల చిత్రీకరణ. దీంట్లో ముఖ్య పాత్రలు మూడు. ఒక commitment phobic ప్రేమికురాలు, పెద్దవారి గురించి పెళ్ళి చేసుకుని ప్రేమికురాలిని మర్చిపోలేని భర్త, గతం ముందే తెలిసి పెళ్ళి చేసుకున్నా ప్రేమికురాలిని మర్చిపోలేదన్న frustrationలొ ఉన్న భార్య. వీరిలో ఎవరి కధ వారిదే, ఎవరి బాధ వారిదే, ఎవరి అలోచనాసరళి వారిదే. మానవ సంభంధాలలో ఉన్న complicationsని అత్యద్భుతంగా చిత్రీకరించాడు గుల్జార్.

ఇక నటన విషయానికి వస్తే నసీరుద్దిన్ షా, రేఖ ఇద్దరూ కూడా చాలా అద్భుతంగా నటించారు. చిట్టచివర శశికపూర్ వచ్చి తన ముద్ర వేసి వెళ్ళిపోతాడు. మంచి screen presence ఉన్న నటులలో శశి ఒక్కడు అన్న విషయం ఈ చిత్రం చూసిన తర్వాతే నాకు తెలిసింది.

సంభాషణలు చాల poeticగా ఉన్నయి. చిత్రంలో సంగీతం చాలా బావుంది. గుల్జార్ పాటలు చాల బావున్నాయి. అందులో అన్నిటికంటే బావున్న పాట ‘మేర కుచ్ సామాన్ తుమ్హారే పాస్ పడా హై’ ఈ పాట గుల్జార్ best పాట అని నా అభిప్రాయం. ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఆర్ డి బర్మన్ సంగీతం.

మీ మంచి స్నేహితులని పిలిచి ఒక french wineతో గాని లేక చాయ్ తో గాని చూడవలిసిన చిత్రం. ఈ చిత్రం తర్వాత వారితో జరిగే చర్చలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి.

చివరిగా చెప్పవలిసిన మాట ఈ చిత్రంతో మా తరంవారు బాగా indentify చేసుకోగలరు. ఈ చిత్రం 1985లో వచ్చింది అంటే ఆశ్చర్యకరమే.


పూర్తిగా చదవండి