అవురా, ఏమీ జగన్మాయ!
NEWS, Politics, Telugu, andhra, paper, party, saakshi March 31st, 2008
ఈరోజు సాక్షి మొదటి పేజి లోని న్యూస్ "నట్ట నడి బజారులో నియమాలకు గోరి" ని చదివారా? నేను మొదట మొదటి పేజి లోని సంక్షిప్త వార్త చదివాను. నమ్మలేకపోయాను. అవురా, ఇది కలయా లేక జగన్మాయయా! సాక్షి మారుతుందా! ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్త రాసిందా! ఇలా ఎన్నో ఆలోచనలు. ఆలోచనలకి స్వస్తి చెప్పి మొత్తం వార్త చెదువుదామని ఫుల్ స్టోరీ మీద క్లిక్ చేశాను. ?!@#$%^&* మబ్బులువిడిపోయెన్! కేవలం రెండే వరుసలు ప్రస్తుత సమస్యమీద, ఏడు పేరా గ్రాఫులు అంటే దాదాపు 40 వరుసలు, పది సంవత్సరాల క్రితం సంగతి మీద. జగన్ పేపర్ పెట్టింది బాకా ఊదడానికేనని అందరికీ తెలుసు గానీ ఆ ఊదేది ఏదో డైరెక్ట్ గానే ఊద వచ్చుగా?. N.T.R భవన్ మీద వేరే హెడింగ్ తో న్యూస్ వేసిఉండవచ్చు. తప్పు జరిగితే అది ఎప్పటిదైనా, ఎవరైనా శిక్షింపబడాల్సిందే. N.T.R భవన్ విషయం లో తప్పుజరిగితే దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు లేదా మరేదైనా చట్టబద్దంగా వ్యవహరించవచ్చు, ఇంకా కావాలంటే అందుకు బాధ్యులని జైలుకి పంపించవచ్చు. ప్రభుత్వం వారిదే కదా. ప్రస్తుత సమస్య భీమ్ రావు బాడ వాసులకు జీవన్మరణ సమస్య. దయచేసి ఆ సమస్యని పక్కదారి పట్టించవద్దు. పూర్తిగా చదవండి