ఈనాడు లొ కధలు - నా జ్ఞాపకాలు
జ్ఞాపకాలు April 2nd, 2008
అప్పట్లొ అనగా ఎనభైలలొ అనుకుంటా ఈనాడు రెండవ పేజీ కింద కుడి మూల ఒక నెల రోజుల పాటు ఒక చక్కని కధ ప్రచురించబడేది. నేను చదివిన వాటిలొ తెనాలి రామలింగడు, భక్త తుకారాం, భక్త కన్నప్ప మొదలైనవి కొన్ని. కాని ఆ కధలు కొన్ని ఏళ్లు మాత్రమె ప్రచురించబడ్డాయి.
ఆప్పట్లొ పొద్దున్నె పేపరు అబ్బాయి వీధిలోంచి గుమ్మంలోకి పేపరు విసరగానె నేను మా అన్నయ్య ఆ కధ చదవటం కోసం ఒక్కొక్కప్పుడు ముష్టి యుధ్దాలు చేసుకునేవాళ్లం. ఆ రెండో పేజీ దక్కక పోతె, మొదటి పేజీ దక్కించుకొని తృప్తి పడేవాణ్ణి (ఎందుకంటె స్పోర్ట్స్, ఇదీ సంగతి, టూకీగా మొ.గు నవి దాని లొ నే కదా ఉండేవి).
ఆ కధలని కత్తిరించి మా నాన్నగారు పుస్తకంలా కుట్టేవారు, ఆ విధంగా సుమారు ఓ పది పోగు చేసాం. అలా పుస్తకాలంటె మా స్నేహితులకి బాగా క్రేజీ ఉండేది. ఈ సారి ఇండియా వెళ్లినపుడు మా ఇంటి అటకమీద, ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి వెతుకుదమని ఉంది. చూద్దాం ఎంతవరకూ నా ఈ ఆకాంక్ష నెరవేరుతుందొ.
పూర్తిగా చదవండి