ఓం నమః శివాయ ఓం నమః శివాయ
Telugu April 3rd, 2008
( శివ పంచాక్షరీ మహిమ వర్ణనము )
ఓం నమః శివాయ ఓం నమః శివాయ |
పంచాక్షరి యిది పరమ పావనము || (పల్లవి)
పంచభూతములపై ఆధిపత్యమును - ప్రసాదించగల మహామంత్రము |
సుందర కవితా చాతుర్యరీతి - ననుగ్రహించెడి మహా మంత్రము ||
వేదాంత జలధి మధనామృతమగు - జ్ఞానమునిచ్చెడి మహామంత్రము |
సర్వ విక్షోభ ప్రశమన కరమై - మనశ్శాంతినిడు మహామంత్రము
అష్టసిద్ధులను అవలీలగాజేయు - శక్తినిచ్చెడి మహామంత్రము |
చక్రాలదాటి సహస్రారమున - శివునిఁ జేర్చెడి మహామంత్రము ||
ఆదిదేవుని అంఘ్రి పద్మముల - భక్తి నొసగెడి మహామంత్రము |
నిష్టానిశ్చల యమనియమాసన - ధ్యానయోగకర మహామంత్రము ||
సంసారవాసనా విషయధ్వంసక - కామదహనమీ మహామంత్రము |
అనన్యమద్భుత వైరాగ్యమిచ్చు - సర్వ పాపహర మహామంత్రము ||
Download this bhajan sung by Shri Dattaswami here
పూర్తిగా చదవండి