నేటి భారతం -ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పై ఒక సరదా క్విజ్..!!
నేటి భారతం April 5th, 2008ఈ క్రింది ప్రశ్నల కు ఒక్క నిమిషం లో సరైన సమాధానం చెప్పిన వాళ్ళలో మా లక్కి డ్రా లో గెలుపొందిన వారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న “ఇందిరమ్మ గ్రుహ పథకం క్రింద మీకు ఒక “ఇందిరమ్మ ఇల్లు” మంజూరు చేయబడును.. ఆలసించిన ఆశాబంగము నేడే మీ “ఇందిరమ్మ ఇల్లు” ని మీ సొంతం చేసుకోండి..
1. మన రాష్ట్ర్ర్రపతి ఎవరు?
అ. ఆబ్దుల్ కలాం గారు
ఆ. కె. ర్. నారయణన్ గారు
ఇ. వెంకట స్వామి (కాకా) గారు
ఈ. పైవేవి కావు
2. మన ప్రధాన మంత్రి ఎవరు ?
అ. ప్రణబ్ ముఖర్జి గారు
ఆ. రాహుల్ గాంధి గారు
ఇ. సోనియా గాంధి గారు
ఈ. పైవేవి కావు
3. మన రాష్ట్ర్రం లో ప్రధాన ప్రతిపక్ష్ నాయకుడు ఎవరు?
అ. హరిరామ జోగయ్య గారు
ఆ. కె. ఎ. పాల్ గారు
ఇ. రామోజి రావు గారు
ఈ. పైవేవి కావు
(గమనిక : యీ బ్లాగు లో ని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్ప్పితం మాత్రమే, ఎవరని వుద్దేశించినవి కావు..ఇది మన నేటి భారతం గురించి సరదా సరదాగా ఒక వ్యంగ్యం మాత్రమే, ఎవరని కించ పరచడానికి కాదు, ఎవరి మనసునైనా నొప్పించి ఇబ్బంది కలిగించే వ్యాఖ్యలు వుంటె , మా ద్రుష్టి కి తీసుకు వస్తే తిరిగి సవరించుకుంటాము.. మనమందరము భారతీయులం.. జై హింద్ !!)

పూర్తిగా చదవండి