ఇంత కన్నా ఏమి కావాలి అంటారు చాలా మంది..కాని ఒక్కసారి ఈ టపా ని ఆసాంతం తిలకించండి..

దేవరపల్లి - నాకు ఏమి తెలియదని తెలుసుకోగలిగాను,  కొత్త పాళీ- జీవిత పరమార్ధం ఏవిటి? చదివాక యెప్పటి నుండో నా లో జరుగుతున్న సంఘర్షణ చెప్పాలనిపించింది..దాని అక్షర రూపమే ఈ టపా..

   మనిషి పుట్టుక కు అర్ధం ఏమిటి? అమ్మ, నాన్న, పుట్టడము, పెరగడము, చదువుకోవడము, (యీ చదువు అనేది ఒక వ్యాపార ద్రుక్పథం గా మారి పొయింది. ఎలా అంటే ఇష్ట్టా ఇష్ట్టాల తో సంబంధం లేదు, యే చదువు కి ఏక్కువ డబ్భులు వస్తాయి, యే చదువు చదివితె త్వరగా సెటిల్ అవ్వోచ్హు, యిలా అయ్యాయి మన జీవితాలు), వుద్యొగం (యిది కుడా పెళ్ళి చేసుకోవడానికి పిల్ల ని యివ్వాలి అంటే తప్పదు కాబట్టి), పెళ్ళి , పిల్లలు , మరల యధాలాపం గా అమ్మ, నాన్న, పుట్టడము.. యిది ఒక చక్రము అండి..జీవిత చక్రము.. చూశారా ఎలా పరిబ్రమిస్తుందో.. తిరిగి మరల అదే చోటు కి వస్తాము.. కాకపోతె కాలానుగుణం గా వేసే పాత్రలు మారతాయి…కుదిరితే కాస్తా డబ్బు కూడ బెడతాము..
  యిప్పుడు చెప్పండి మిత్రులారా, యిదేనా జీవితం?? యిది సరి పోతుందా??  యివి కాక మద్యలో బందాలు, బంధుత్వాలు, సెంటిమెంట్ లు మనకి తెలియకుండానే మనము ఎమొషనల్ బ్లాక్ మెయిల్ అయి పొతాము.. యిక్కడ మీకు ఒక చిన్న చమక్కు చెప్పనా , ప్రతి మనిషి జీవితం లో పుట్టిన దగ్గర నుండి చని పోయే  వరకు జరుగుతున్న యింత మెలో డ్రామా కి   కారణం కేవలం మన బుర్ర (బ్రెయిన్) లో  విడుదల అయ్యే  “సెరటోనిన్, నార్ ఎపినెఫ్రిన్” అనే రెండు హార్మోనులు మాత్రమె అంటే నమ్మగలరా!! మనం ఏడుపు వచ్హి ఏడవాలి అన్న, నవ్వు వచ్హి నవ్వాలి అన్న, కోపం వచ్హి కొట్టాలి అన్నా ఆ రెండు హార్మొను ల పర్మిషన్ తీసుకోవాలిసిందే మరి..

 యిదేమిటొ యిలాంటి అనుకరణ జీవితాలు మరీ మన దేశము లో నే యెక్కువ..యెలా ఉంటుంది అంటే మా తాత చేశారు అని మా నాన్న చేశారు, మా నాన్న చేశారు అని నేను చేస్తాను, నన్ను చూసి రేపు నా పిల్లలు.. యిది మంచో చెడో నాకు తెలియదు కాని, దీని వలన చాలా మంది వారి జీవిత పరమార్ధము ఎమిటొ తెలుసుకోకుండానే స్తితి గతులు అవుతున్నారు అని మాత్రం చెప్పగలను.. మానవుడు “నేను” , “నా వాళ్ళు” అనే ఉచ్హు లో పడి కొట్టుకు పోతున్నాడు.. “నేను” వరకు స్వార్ధం చూసుకోవడము లో బాగానే ఉంటుంది.. కాని అదే స్వార్ధాన్ని “నా వాళ్ళు”  అంటూ బంధాలు, బంధుత్వాల తో కొద్ది మంది కి మాత్రమె పరిమితము చేసుకుంటూ, సంకుచితము గా వ్యవహరిస్తున్నారు… కాని “నా వాళ్ళు” అనే దాన్ని కాస్త విస్తరించి చూస్తె యెవరి జీవితానికి వారికి పరమార్ధం దొరికినట్లే అనుకుంటున్నాను.. యేమంటారు…!! మనిషి కి స్వార్ధము తప్పక వుండాలి అనే అంటాను, కాని అది ఆ “నేను” వరకే వుండాలి (అప్పుడే కదా కొత్త కొత్త అలోచనలు, యిన్నోవెషన్ వచ్హేది)..కాని ఆ స్వార్ధము “నా వాళ్ళు” వరకు విస్తరించ కూడదు..అప్పుడే మనుషుల మద్య ఆంతరాలు పెరుగుతాయి.. యిప్పుడు మన సమాజం లో వున్న “అంతరాల” కి కారణము, ప్రతి మనిషి యొక్క ఈ “నా వాళ్ళు” అంటూ యే కొద్దిమందికే పరిమితమవుతున్న స్వార్ధమే.. అందుకే అది విడనాడదాము..జగమంత కుటుంబము నాది.. అంటూ ముందుకు సాగి, మన జీవిత పరమార్ధము తెలుసుకొందాము..

జీవితము అంటే ఇచ్హి పుచ్హుకోవడము (Sharing).. ఏది మనతో ఆగి పోకూడదు, అది ఆనందం కావచ్హు, విజ్ణానము కావచ్హు..భగవద్గీత లో “పెద్దాయన” చెప్పినట్లు వస్తూ నువ్వు ఏమి తీసుకు రాలేదు, పోతూ ఏమి తీసుకు పోవు..ఇంత కన్నా గొప్ప పరమార్ధము యేమైనా వుంటున్దా జీవితం లో..

 నా మనసు లో వున్న సంఘర్షణ ని బాగానే వ్యక్తీకరించాను అనుకుంటున్నాను..


పూర్తిగా చదవండి