నిరాశలో ఎన్ని వేడి నిట్టూర్పులు విడిచానో..
గది నాలుగు గోడలకే తెలుసు..
నీధ్యాసలో ఎన్ని అశ్రువులు రాల్చానో..
తలపులు పంచుకొనే తలగడకే తెలుసు..
విరించినై ఎన్ని ప్రేమలేఖలు రాసానో..
వలపులు నింపుకొనే నా అక్షరాలకే తెలుసు..
విపంచినై ఎన్ని రాగాలు పలికించానో..
తలపులు వొంపుకొనే నా మది గవాక్షాలకే తెలుసు..

ఇవన్నీ నీకై నే రాసే వలపు కావ్యాలు..
ఇవన్నీ నీకై నే దాచే తలపు దృశ్యాలు..
పూర్తిగా చదవండి