ఆలోచనల అనంత సాగర గర్భాన నిలుచుంటావు..
సులోచనల రెప్పల మాటున సిత్రమై దాగుండిపోతావు..
అంతులేని ఊహల మేఘమాలికలలో పవళించిపోతావు..
పొంతన లేని కలలా కడలి కెరటమై నను ముంచెత్తుతావు..
సైతకసీమల్లో శిలలా నిలిచి నను మైమరచుతావు..
ప్రతిరోజూ నిన్నటి కలలా మిగిలి నను బాధల్లో నిలిపేస్తావు..
నేడు రేపయ్యేలోగానే నను ఊహల్లో నిలిపి, నిన్నటి స్వప్నంలా మిగిలిపోతావు..
మొన్నటి జ్ఞాపకంలా..
నిన్నటి కలలా..
నేటి తలపులా..
రేపటి ఊహలా..
మిగిలి నిత్యం నను మాయచేసి నా ఎద పరదా చాటున నీలినీడలా పరుండిపోతావు..
పూర్తిగా చదవండి