ఆహ్వానం
వివిధ April 9th, 2008
యల్.వి.ప్రసాద్ గురించి తెలియని భారతీయ సినిమా ప్రేక్షకులు ఉండరని మా ప్రగాఢ విశ్వాసం.మామూలుగా కంటికి కనిపించని ఒక విత్తనం మర్రిమహావృక్షంగా మారిందంటే నమ్మని వారికి యల్.వి.ప్రసాద్ గారి జీవిత మహాప్రస్థానం ఒక సజీవ ఉదాహరణ.మొదటి హిందీ,తెలుగు,తమిళ టాకీ చిత్రాల్లో నటించిన ఏకైక వ్యక్తిగా ఘనతకెక్కటమే కాక,తను స్వయంగా ఒక సంస్థలా పరిణామం చెందిన గొప్ప వ్యక్తి ఆయన.ఆలంఆరా నుంచి అమావాస్యచంద్రుడు వరకూ ప్రసాద్ గారి జీవితమంతా భారతీయ చలన చిత్ర చరిత్రే.ఆ మహనీయుడి చిత్రాలనుంచి కొన్ని ఆణిముత్యాలను ఎంపిక చేసి సమగ్రమైన వ్యాఖ్యానం,చాయాచిత్రాలతో కూడిన రచనలను నవతరంగం ఆహ్వానిస్తుంది.
పూర్తిగా చదవండి