lvprasad2.jpgఅక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు.

చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ చిన్న చిన్న వేషాలు పోషించి నటనపై ఆసక్తి పెంచుకున్నారు. ఇలా నటన, చలనచిత్రాలపై చిన్ననాటి నుండీ పెంచుకున్న ఆసక్తే ఆయన జీవితాంతం కొనసాగింది.

1924 లో, పదిహేడు సంవత్సరాల వయస్సులో మేనమామ కుమ్మర్తె సౌందర్య మనోహరమ్మ ను వివాహం చేసుకున్నారు ఈఅయ్న. ఆ దంపతులు త్వరలోనే ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ రోజుల్లో ప్రసాద్ తండ్రిగారు చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో వారింట్లో కష్టాలు మొదలయ్యాయి.చివరికి వారు దివాళా తీయడంతో కుటుంబం ఘోర పరాభవాన్ని ఎదురుచూడవలసివచ్చింది. ఈ సమయంలోనే ప్రసాద్ తన నటనా కౌశలంతో చలనచిత్రసీమలో మంచి నటుడిగా ఎదిగి ఇంట్లో వారి కష్టాలు తీర్చవచ్చు అని నిర్ణయించుకుని,జేబులో కేవలం వంద రూపాయల తో,సినిమా ఫక్కీలో,ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బొంబాయి కి పారిపోయారు.

బొంబాయిలో వుండగా దాదర్ ప్రాంతంలో వున్న కోహినూర్ ఫిల్మ్ స్టూడియో గురించి విని ఉన్న ప్రసాద్, ఆ స్టూడియో దగ్గర సినిమా వాళ్ళను కలుసుకోవచ్చనే ఉద్దేశంతో 1930 జనవరి ఒకటవ తేదీన దాదర్ స్టేషన్ లో రైలు దిగాడు ప్రసాద్. రామకృష్ణ అనే లాడ్జిలో మకాం ఏర్పరుచుకున్న ఆయనకు కొద్ది రోజుల్లోనే అతని కలలు నిజం చేసుకోవడం ఎంత కష్టమో అర్థమయిపోయింది. అసలే హిందీ కానీ ఆంగ్లం లో కానీ మాట్లాడడం తెలియని ఆయనకు జీవితం మరింత కష్టమైపోయింది. వచ్చీ రాని ఆంగ్ల భాషలో ఎంతో మందికి సినిమాల్లో పని చేయాలనే తీవ్ర వాంఛను తెలియచేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అయ్యాయి. సినిమాల్లో అవకాశం కాదు కదా కనీసం కోహినూర్ స్టూడియోలోకి కూడా ప్రవేశం దక్కకపోవడంతో, స్టూడియో చుట్టూ తిరుగుతూ గోడ సందుల్లోంచి గంటల తరబడీ, ఆ రంగుల ప్రపంచంలోకి ఎప్పుడు వెళ్తానా అని తీవ్రంగా ఎదురుచూసే వాడు.

ఇలా రోజంతా స్టూడియో చుట్టూ తిరగడం, కోహినూర్ స్టూడియో కి ఎదురుగా వున్న టైలర్ షాపు కి వచ్చీ వెళ్ళే సినిమా తారలను గమనించడం తో కొన్నాళ్ళు గడిపేసాడు ఆయన. ప్రతిరోజూ స్టూడియో వద్దకు ఠంచనుగా వచ్చివెళ్ళే ప్రసాద్ ఆ టైలర్ షాపు యజమాని కళ్ళల్లో పడ్డాడు. అప్పుడప్పుడూ మాట్లాడడం ద్వారా సినిమా పై ప్రసాద్ కి వున్న ఆసక్తి ని గమనించాడు ఆ షాపు యజమాని. కానీ అక్కడకు వచ్చి వెళ్ళే సినిమా తారలు మాత్రం ప్రసాద్ కలలను తీరని కలలని నవ్వి గేళి చేసేవారు. అయినా కూడా ప్రసాద్ పట్టువుడవకుండా ప్రతిరోజూ ఆ టైలర్ షాపు దగ్గర సినిమా వాళ్ళను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుండేవాడు.కొద్ది రోజుల తర్వాత తను వుంటూన్న హోటల్ గదిలో ఎవరో చొరబడి వున్న కాస్త సొమ్ము దొంగలించడంతో ప్రసాద్ రోడ్డున పడ్డాడు.


పూర్తిగా చదవండి