నేను లిస్బన్‌కి తరచూ వచ్చి వెడుతూంటాను. నెలకోసారి కాకపోయినా, కనీసం ఆరు వారాలకొకసారైనా వెడతాను. అక్కడికి వెళ్ళడానికి విమానం ఎక్కుతాను. నా చిన్న తనంలో మా తల్లిదండ్రులు బ్రెజిల్‌లో ఉండడం వల్ల, నాకు ఇక్కడి భాషతో ఇబ్బంది ఎదురవలేదు. దుబాసీ అవసరం లేకుండా నెట్టుకొచ్చేస్తున్నాను. ఈ నగరం కూడ నాకు బాగానే తెలుసు. మనం తరచూ వెళ్ళే ప్రదేశాలన్నీ మనకి బాగా తెలుసనిపిస్తాయి. కానీ లోతులకెడితే అక్కడి ప్రతీ వస్తువు కొత్తగా ఉండి మనకి పరాయితనాన్ని గుర్తుచేస్తాయి. అందుకే లిస్బన్‌లో [...]
పూర్తిగా చదవండి