సాహిత్య ప్రక్రియలలో అతి కఠినమయినది,ఎంత బాగా చేసినా అందరి ఆమోదమూ పొందలేనిది అయిన ప్రక్రియ అనువాదం.కానీ,అనువాదం అత్యవసరమయిన ప్రక్రియ.ఒక భాశలోని రచనలు మరొక భాశవారికి తెలియాలంటే అనువాదం తప్ప వేరే గత్యంతరం లేదు.లేదా,ఆ భాషను నేర్చుకోవటం తప్ప మరో మార్గం లేదు.కాబట్టి అనువాదాల ప్రాముఖ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మూలం సూర్యుడయితే,అనువాదం చంద్రుడి వంటిది.మూలంలోని వాడి,వేడి లేకున్నా,ఆ కిరణాల లోని వెలుతురు ప్రసరింప చేయగలగాలి అనువాదాలు.వేడి కిరణాలను ప్రతిఫలిస్తూ,వాటిని చల్లగా అందరికీ అందించాలి.మూల భాషలోని నుడికారాలు,చమత్కారాలు,పలుకుబడులు పరాయి [...]
పూర్తిగా చదవండి