ఆ రోజులే మరల వస్తే..!!(గుర్తుకొస్తున్నాయి తెర బొమ్మ రోజులు)
Uncategorized April 13th, 2008 నిన్న పావని గారి వీర బాదుడు 3 లో చెప్పినట్లు, అందరం గత స్మ్రుతులు తలుచుకుంటూ ఆ రోజులు మరలా వస్తాయా అనుకుంటూ వుంటాము..మా తాత ఏమంటారు అంటే మీరు బలే ఎంజాయ్ చేస్తున్నారు, అమ్మయిలు, బైక్ లు..పార్క్లు లు, పిక్నిక్ లు..(ఒకసారి వూహించుకోండి మనమే 1970 ల లో వుంటే, మన ఆడ స్నేహితురాలు తో కాస్తా హుషారుగా, షికారు కి వెల్లొద్దాం అంటే ఏమిటి పరిస్థితి అని, యెముంది చాలా సులభము, చక్కగా కొష్టం దగ్గరకి వెల్లి కాడి ఎద్దులు రెండి విప్పి, రంగులు దిద్దిన యే టైరు బండో కట్టుకు పోవడమే..హ్హహ్హాహ్హ).. ఏమిటి గుండె తరుక్కు పోతుందా మన నాన్నలు, తాతలు ప్రేమాయణపు షికార్లు చూసి..
ప్రపంచం లో మార్పు అనేది సహజమండి..దేనికి ఏది కొలమానికం కాదు..మన తండ్రుల కాలం లో అలా చేసుకునే వాల్లు తిరిగి ఆ రోజులు వస్తయా అని అడుగుతున్నారు.. ఈ పండుగలు, సంతలు, జాతరలు, తిరునాళ్ళు వీటి అన్ని ముఖ్య వుద్దెశ్యం మనం మరి స్వతంత్ర బతుకులు బతక కుండా నలుగురి తో కలిసి బతకడానికి.. ఆంతే కదా.. అలానే, ఇప్పుడు పాత పండగలు పొయి కొత్త కొత్త పండగలు వస్తున్నాయి కదా అండి..మన తాతలు యెరుగుదురా జనవరి1, ఫిబ్రవరి 14, అమ్మల రోజు, నాన్నల రోజు, దెయ్యాల రోజు, బూతాల రోజు.. మనకి మరి ఆశ ఎక్కువండి బాబు, యిన్ని పండగలు చేసుకుంటూ,ఇంకా కావలి అనుకుంటాము.. అలాగె తిరునాళ్ళ చోటు లో కార్నివల్స్ అని, సంతలు జాతరల చోటు లో మాల్స్, తెర బొమ్మ సినిమా చోటులో , డ్రైవ్ ఇన్ థియేటర్ లు అని.. యిలా మారుతుంది అంతే.. కావున గడిచి పోయినవి ఒక తీపి జ్ణాపకాలే కాని, తిరిగి ఆ రోజులు వస్తాయా అనుకోవడం అత్యాశ నే అవుతుంది అనుకుంటాను.. ఏమంటారు?
కాని యిన్న్ని చెప్పినా ఆ రోజులు వేరు, అవి తిరిగి రావు.. తెర బొమ్మ అంటే గుర్తుకు వచ్హింది.. మా వూరు లో పండగ వచ్హింది అంటె, పేట నుండి ప్రొజెక్టర్ పట్టుకొని ఒకడు దిగుతాడు.. చిన్న పరదా కట్టి, “బొళ్ళా బోడియ్య గారి కొష్టం” లో సినిమా వేసె వాల్లు.. టికెట్ ఒక రూపాయి మాత్రమే..అర్ధ రూపాయి తో నడిపిన రోజులు కూడా వున్నాయి లే. ఒక్కోసారి మరీ కక్కుర్తి అనుకుంటే వెదవలు పగలు కూడా వెసే వాళ్ళూ కాస్త గుడ్డ అడ్డం పెట్టి.. నేను అలా చూసిన సినిమాల లో నాకు బాగా గుర్తు “బొబ్బలి సింహం” “జగదేకవీరుని కథ” “ఖైది” యిలా..టపా రాస్తుంటే గతం గుర్తుకు వచ్హి, అప్పుడు జనాలు చేసె కామెడి తలుచుకుంటే నవ్వు వస్తుంది..అందరూ యెవరి చాప లు, దుప్పట్లు, యూరియా గోతాలు, వేసుకొని బయలుదేరే వాళ్ళు..చక్కగా తెర ముందు పడుకొని చూడాలి కదా…హ్హ హ్హ హ్హ ..సాయంత్రం సినిమా వుంది అంటే, పిల్లలు మద్యాహ్నం కె “నిరోధ్ పీకలు” తయారు చేసుకొని, వాటి లో కాగితపు ముక్కలు నింపి.. మన అభిమాన హిరో పాట కాని, దెబ్బలాట కాని వచ్హింది అంటే తెర మీద కనీసం ఒక 25 -30 పీకలు యెగిరేవి.. వాటి నీడలు తప్పించి తెర మీద ఏమి కనిపించేది కాదు.. ఒక్క రూపాయి ఇచ్హి సినిమాని మూడు సార్లు చూడొచ్హు అదెలా అంటారా?? ఎముంది నచ్హిన పాటని, డైలాగు ని, దెబ్బాలాట ని చచ్హినట్లు రిపీట్ చెయాలిసిందే, లేకపొతే తెర చిరిగి పోదు, తెల్ల్లారాక ప్రొజెక్టర్ పేట కి పోయిద్దట్లా.. వరుస అయ్యే అమ్మయిల కి చూపుల, వలపుల బాణాలు విసురుతూ, సొంత డైలాగుల తో వూరులో కాస్త కామెడి రకమైన మనుషుల మీద జోకులు వేస్తూ, వారి హీరోయిజం చూపించుకుంటూ..వాహ్హ్వా.. నిజంగా హాట్సాఫ్.. ఎన్ని వందలు పెట్టి, ఎన్ని మల్టిప్లెక్స్ ల లో, ఏ ఐ-మాక్స్ థియేటర్ లో సినిమా చూస్తే అంత ఆనందం కలుగుతుంది చెప్పండి…నిన్న పావని గారి వీర బాదుడు 3 పుణ్యమా అంటూ ఒకసారి గత స్మ్ర్రుతులు నెమరువేసుకునె బాగ్యం కలిగింది ..దన్యావాధాలు!!.

కొసమెరుపు- మీరు ఇప్పటకి కూడా గుంటూరు వంటి మహ నగరం లో యీ తెర సినిమా చూడాలి అనుకుంటే, యి నవమి రాత్రులు , బ్రాడి పేట 4/8 వ లైను లో UTI ATM ఎదురు గా నవమి పందిరి లో ప్రతి సంవత్సరం తెర సినిమాలు వేస్తారు.. కాకపోతే అన్ని పాత సినిమాలు… యివి మన గత తీపి గుర్తులు..

పూర్తిగా చదవండి