శ్రీ దత్త భగవానుని షోడశ కళలతో అవతరించిన పరబ్రహ్మమే శ్రీ కృష్ణ
పరబ్రహ్మము. అందులకే శ్రీ కృష్ణ భగవానుల అవతారమును పరిపూర్ణ
తమావతారముగా వర్ణించుట జరిగినది.

1. ఋషివరాణాం మానసాలోలహంసాయ - మకుటాన్తమయూర పింఛావతంసాయ |
ఏకప్రహారేణ విధ్వస్తకంసాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

2. వ్యత్యస్త విన్యస్త పాదారవిన్దాయ - మధురామృతాసార మురళీనినాదాయ |
జాజ్వల్యమానాంశు పీతామ్బరాఙ్గాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

3. ఆకర్ణ తేజస్వి మీనాయతాక్షాయ - ప్రత్యూష పద్మాంశు నేత్రచ్ఛద యుగాయ |
కమల లోచన కాంతి సమ్మోహనాస్త్రాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

4. ఆముక్త ముక్తావళీ జాల హారాయ - గోపీ దధి క్షీర నవనీతచోరాయ |
బృందావనే వల్లవీ బృంద జారాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

5. సాయంతనే ధేను బృన్దాను గమనాయ - మార్గమధ్యే వల్లవీ కుంచితాక్షాయ |
రాధాజగన్మోహినీ మోహనాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

6. కాళీయ ఫణి ఫణా సంక్షోభ నటనాయ - కాంచీక్వణ త్కింకిణీ నిస్వనాయ |
గోవర్ధనోద్ధరణ లీలాస్మితాస్యాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

7. కస్తూరికాతిలక రేఖాలలాటాయ - తులసీ స్రగామోద వక్షః కవాటాయ |
పార్ధాయ విశ్వరూపాలోలఖేటాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

8. శ్రీ రుక్మిణీ సత్యభామా సమేతాయ - గోపీ సహస్రేణ సంవేష్టితాఙ్గాయ |
రాసే రసే సర్వదా సద్వినోదాయ - శ్రీ వేణుగోపాలకృష్ణాయ వన్దనమ్‌ ||

Download this bhajan sung by Shri Dattaswami here
పూర్తిగా చదవండి