శ్రీదత్త హనుమదీశ్వరం | ధ్యాయామి రఘుపతి ప్రియమ్‌ |
ప్రజ్ఞాని భక్త యోగినం | పావనిం పరమ పావనమ్‌ || (పల్లవి)

1. అన్నా ! అన్నా ! ఓ హనుమన్నా ! | పాపములెన్నో చేసితినన్నా ! |
దయతో నీవె క్షమించకున్న | దిక్కులేదు నా సాధన సున్న ! ||

2. ఇంద్రియ నిగ్రహమసలే లేదు | నీకు తమ్ముడని చెప్పుట సిగ్గు ! |
నిష్కామ సేవ కలలో మాట | అదియే గద నిత్యము నీబాట ||

3. పరమవావనా ! పవన కుమారా ! | రుద్రావతారా ! నిర్జిత మారా ! |
వీరాధివీర ! వేదార్ధసారా ! ఖల సంహారా! గిరి సంచారా ! ||

Download this bhajan sung by Shri Dattaswami here
పూర్తిగా చదవండి