సిక్స్త్ సెన్స్ తర్వాత మనోజ్ నైట్ శ్యామలన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ signs, unbreakable, village సినిమాలు ఫర్వాలేదన్నట్టుగా వుంటాయి. సినిమా చివర్లో వచ్చే ‘ట్విస్ట్ ఇన్ ది టేల్’ తో మొదటి నాలుగు సినిమాలు తీసిన శ్యామలన్, ఐదో సినిమా Lady in the water తో ’ట్విస్ట్’ లేకుండా స్ట్రైట్ ఫార్‍వర్డ్ కథనంతో ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమాకూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా The Happening తో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టం పరీక్షించుకోడానికి వస్తున్నాడు శ్యామలన్.

ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలయింది. చూడ్డానికి మరో ఏలియన్ ఇన్వేజన్ సినిమా లా అనిపిస్తుంది. విలేజ్ సినిమా ట్రైలర్ చూసి కూడా జనాలు ఇలానే అనుకున్నారు. కానీ ఆ సినిమాలో చివర్లో వచ్చే ట్విస్ట్ అది నిజం కాదని తేలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా లో ఏం ట్విస్ట్ వుందో?

More about this movie

Night Shyamalan there is a twist in the tale


పూర్తిగా చదవండి