బాబోయ్ దెయ్యం - సాస్కెన్ కి వచ్చిన కొత్త కష్టం
devil, faith, sasken April 19th, 2008బెంగళూరు లో వున్న టాప్ టెలీకామ్ కంపెనీ "సాస్కెన్ (Sasken) టెక్నాలజీస్" కి పాపం కష్టాల మీద కష్టాలు. క్రితం నెలలోనేమో కెనడా దేశానికిచెందిన లీ అనే ఒక పోకిరీ ఉద్యోగి వ్రాసిన కర్నాటక వ్యతిరేక పద్యానికి "కర్ణాటక రక్షణ వేదిక (K.R.V)" ఆగ్రహానికి గురిఅయింది. ఆ దాడిలో భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఈ విషయం మీద మరిన్ని వివరాలకు గూగుల్ చేయండి. లీ వ్రాసిన వివాదాస్పదమైన పూర్తి పద్యం Thatskannada.Oneindia.in లో ఉంది. మరో పక్క స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీ షేర్ వాల్యూ రోజురోజుకీ క్రిందికి పోతోంది. ఇవి చాలవన్నట్లు గోరుచుట్టు మీద రోకలిపోటులా గత కొన్ని రోజులనుండి సాస్కెన్ కి ఒక దయ్యం బెడద వచ్చిపడింది. ఐ.టి. కంపెనీ ఏంటి, దెయ్యం నమ్మకం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే పూర్తిగా చదవండి. దొమ్ములూరు (విమానాశ్రయం రోడ్డు) లో ఉన్న ఈ కంపెనీ ఆఫీసు కి ప్రక్కనే ఉద్యోగుల పిల్లలని ఉంచడం కోసం కొత్తగా ఒక ఇంటిలో చైల్డ్ క్రష్ ని ఏర్పాటు చేసుకున్నారంట. చిన్న చిన్న పిల్లలు గల ఉద్యోగులు, ఉద్యోగ వేళలలో తమ పిల్లలను ఈ క్రష్ లో ఉంచి ఆఫీస్ అయిపోయిన తరువాత తిరిగి ఇంటికి తీసుకెళుతూ వుంటారు. గత కొన్ని రోజుల నుండీ క్రష్ హోం లో విచిత్ర మైన సంఘటనలు జరుగుతున్నాయని ఆ క్రష్ హోం ఉద్యోగులు అంటున్నారట. అదిగో పులి ఆంటే ఇదిగో తోక అన్నట్లు, బక్కెట్లు వాటంతట అవే జరిగాయని, రాత్రి వేళల్లో ఒక తెల్లటి ఆకారాన్ని చూశామని కొంతమంది అంటున్నారు. చివరకి ఆ హోం ఉద్యోగులు మేమిక్కడ పనిచెయ్యం బాబో అంటే, ఆ విషయం కాస్తా టాప్ లెవల్ మేనేజ్మెంట్ కి వళ్ళిందట. దయ్యం అంటే వారు మటుకూ ఏంచేస్తారండి? ఆ విషయం ఏదో కనిపెట్టేవరకూ సాస్కెన్ ఆఫీస్ ఆడిటోరియం లో ఆ క్రష్ ని నిర్వహించమన్నారట. ఈ బ్లాగు వ్రాసే సమయానికి ఆ హోం ఆడిటోరియంలోనే నడుస్తోందని సాస్కెన్ లో పనిచేస్తున్న మిత్రుడు చెప్పారు.
పూర్తిగా చదవండి