తెలుగు లో ఉచిత “ఫాన్సీ ఫాంట్స్ (Fancy Fonts)” లేవా?
Telugu, fonts April 23rd, 2008
నాకు ఫాన్సీ ఫాంట్స్ అంటే పిచ్చి. నా కున్న ఈ పనికి రాని అలవాటు వలన, నేను వెబ్ ని బ్రౌస్ చేస్తున్నప్పుడు కనపడిన ప్రతి ఫాన్సీ ఫాంట్ (Fancy Font) నీ నా సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసిచూస్తుంటాను. తరువాత వాటినుపయోగించి డాక్యుమెంట్స్ రాసి వాటిని ప్రింట్ చేసి స్నేహితులకి, సహోద్యోగులకి ఇస్తుంటాను. ఇంగ్లీష్ కి సంభందించి చాలా ఫాంట్స్ ని ఇన్ స్టాల్ చేసుకున్నాను. బేనర్, వాల్ పేపర్లు, లోగో బొమ్మలను తయారు చేయడంలో , వాటిని ప్రింట్ చేసుకోవడానికి ఈ ఫాన్సీ ఫాంట్ లు ఉపయోగ పడతాయి.ఆ రకంగా తెలుగు కు సంభందించి ఈనాడు, ఏపీ న్యూస్, పోతన, శ్రీ , తిక్కన , గౌతమి లాంటి ఫాంట్స్ నా సిస్టమ్ లో ఉన్నాయి. కానీ ఈ తెలుగు ఫాంట్స్ ని ఉపయోగించి టైప్ చేసినప్పుడు లేదా ఆ వెబ్ సైట్ లను చదివినప్పుడు అన్ని అక్షరాలూ దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. అంటే ఇవేవీ కూడా ఫాన్సీ ఫాంట్స్ కావన్నమాట. ఈ మధ్యనే అనుకోకుండా "వేమన" అనే ఫాంట్ ని ఇన్ స్టాల్ చేయడం జరిగింది. ఆ తరువాత కూడలి సైట్
ని చూస్తున్నప్పుడు ఆ సైట్ అక్షరాలలో మార్పు ని స్ప్రుష్టంగా గమనించడం జరిగింది. పైన చూపిన అక్షరాల స్టైల్ గౌతమి అనే ఫాంట్ ని వాడినప్పటిది. పైన చెప్పిన మిగతా ఫాంట్ లను వాడినప్పుడు కూడా ఈ అక్షరాలు దాదాపు ఇలాగే కనిపించాయి. కాకపోతే గౌతమి ఫాంట్ తో అక్షరాలు బాగా స్ప్రుష్టం గా ఉన్నాయి. అదే సైట్ ని వేమన అనే ఫాంట్ ఇన్ స్టాల్ చేసినప్పుడు ఎలాఉందో చూడండి. అయితే ఈ ఎఫక్ట్ కోసం మన సిస్టమ్ లో ఇటువంటి ఫాంట్స్ ని ఇన్ స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. ఇటువంటి ఫాన్సీ ఫాంట్స్ ఉపయోగం ముఖ్యంగా ఇమేజ్ (Image) లను తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. పైన చెప్పిన ఫాంట్స్ అన్నింటినీ వెబ్ నుంది ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చును. మీకు మరేమైనా తెలుగు ఫాన్సీ ఫాంట్స్ తెలిస్తే క్రింద కామెంట్ చెయ్యడం ద్వారా తెలియపరచగలరు.పూర్తిగా చదవండి