ఈ మధ్య నవతరంగంలో చాలా విషయాల గురించి వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. గతంలో నంద అవార్డుల గురించి, మారుతున్న తెలుగు సినిమా గురించి, గోదావరి లో గూఫుల గురించి, ఈ మధ్యనే జల్సా గురించి, పెద్దలు-ప్రేమలు-సినిమాల గురించి కామెంట్స్ రూపంలో సమస్య (సంగతి) ని చాలామంది తమ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి చర్చలో పాల్గొన్నారు.

అయితే ఏదైనా సమస్య (సంగతి) ని ఇలా పోస్టుల్లో కామెంట్ల రూపంలో కాకుండా ఒక రచ్చబండలో చర్చించి, వీలైతే ఆ చర్చ యొక్క సారంశాన్ని విడిగా మరో పోస్టు వేస్తే బావుంటుందన్న పలువురి అభిప్రాయం మన్నించి నవతరంగంలో కూడా  ఒక చర్చావేదిక ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక్కడ సినిమాని ఒక కళగా లేదా ఒక టెక్నిక్ గా  లేదా ఒక భాషగా భావించి సంబంధిత కోణాల్లో వివిధ అంశాలపై చర్చించి పరిశీలన జరుపుతారని నమ్మకం.

కుల మత జాతి సంబంధమైన అంశాలు పక్కనపెట్టి మేలైన సినిమాకి మార్గాలు వెతుకుదాం. అభిప్రాయ బేధాలుంటే సాటి సభ్యులతో చర్చించండి కానీ పరస్పర దూషణకు దిగరనీ, సినిమాకి సంబంధించిన విశ్లేషణా వ్యాసంగాన్ని నవతరంగం  ఎలా అయితే ప్రోత్సాహిస్తుందో నవతరంగం చర్చావేదిక కూడా అదే దారిలో నడవాలనిఆశిస్తూ…..నవతరంగం చర్చావేదిక లో చేరండి.

అలాగే ఏదైనా అంశం పై చర్చ మొదలుపెట్టిన వారు వీలయితే ఆ చర్చలోని ముఖ్యాంశాలను పోగుచేసి navatarangam at gmail dot com కు పంపిస్తే నవతరంగం వెబ్ సైటులో ప్రచురించగలము.

—-నవతరంగం


పూర్తిగా చదవండి