తెలుగు సినిమా మరియు టి.వి మధ్య ’అక్రమసంబంధం’ !
చర్చ, టి.వి., భారతీయ సినిమా, విశ్లేషణ, సినిమా April 28th, 2008“మీడియా వార్” అంటూ, ’సాక్షి’ దినపత్రిక, ’ఈనాడు’ కొట్టెసుకుంటున్నాయని TV9 నిన్న రాత్రంతా చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరేసింది. పత్రికావిలువలు, పాఠకుడి పట్ల నిబద్దత, పత్రికా స్వాతంత్ర్ర్యం మొదలగు విషయాల్ని గురించి మహామహుల్ని పిలిచి ఊదరగొట్టింపజేసారు. ఈ ప్రహసనం ఇలాసాగుతుండగా, ఇంకో ఛానల్లో ఈమధ్యనే ఫ్రెష్ గా ఫ్లాపైన సినిమాని బ్రహ్మాండమైన ఆదరణతో వందరోజులవైపు పరుగెడుతోందని నిరూపించే ప్రయత్నం నా కంటపడింది. అప్పుడనిపించింది, సినిమా ప్రేక్షకుడిపట్ల ఈ నిబద్దత ని సినిమాతీసేవాడితోపాటు, సినిమాతో అక్రమసంబంధం నెరుపుతున్న టి.వి. కూడా పాటించకపోగా, ఒక వెర్రివెంగళాయిని చేస్తున్నాయని. ఒక సినిమా ని గొప్పగా కాకపొయినా కనీసం సక్రమంగానైనా సమీక్షించే తెలుగు ఛానల్ ఒక్కట్టైనా ఉందా? అంటే సమాధానం శూన్యమనేచెప్పాలి.
ఈ స్థితిని,పరిస్తితిని గురించి ఒక చర్చ అవసరమని నా గట్టినమ్మకం. అందుకే నవతరంగం సాక్షిగా చర్చకు ఆహ్వానిస్తున్నాను. బ్లాగునిర్వాహకులు ఈ ప్రయత్నాన్ని స్వాగతిస్తారని భావిస్తున్నా. చర్చకు 15 రోజుల గడువు విధించుకుందాం. ఆ తదనంతరం, చర్చాఫలాన్ని కూర్చేబాధ్యతని నేను వహించగలవాడనని మనవి.
పూర్తిగా చదవండి