2 సంవత్సరాలు, 189 టపాలు, 12,380 హిట్లు!
Telugu April 30th, 2008
నిజానికి ఈ జనవరి పదో తారీఖునే నా బ్లాగు రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ముచ్చటగా మూడో ఏట అడుగు పెట్టింది. కానీ నేను అప్పుడు బ్లరణ్యవాసం చేస్తూండడం వల్ల పుట్టినరోజు వేడుకలు జరుపుకోలేకపోయాను. కానీ ఈ రోజు హిట్ల కౌంటరు మొదలు పెట్టి రెండేళ్లు కావస్తుండడం వల్ల లేటుగా అయినా లేటెస్టుగా ఈ వేడుకలు జరపడానికి నిశ్చయించాను. సంబరాలంటే ఏం లేవు, అవే పాత టపాలు సమీకరించి, మీకోసం మళ్లీ కొత్తగా...అంతే!అంతర్జాలంలో తెలుగు కోసం మొహం వాచి ఉన్నప్పుడు ఒక్కసారిగా నాలుగు చందమామల (ఒరెమూనా) దర్శనమైందని అప్పుడే సెలవిచ్చాను. అలా, అందరిలాగే 'చావా' కిరణాలతో నా బ్లాగుకు చంద్రోదయమైంది. నా బ్లాగుకు మొదటి వ్యాఖ్యాత కూడా ఆయనే. ఆంధ్రులు ఆరంభశూరులు అన్న నానుడిని పటాపంచలు చేస్తూ, నేటికీ ఎందరో తెలుగు వారికి బ్లాగోదయం కలిగిస్తూ, అవిశ్రాంతంగా బ్లాగుసీమలో దూసుకెళుతున్నారు.
మొత్తానికి ఈ ప్రయాణంలో ఎందరో కొత్త స్నేహితులని సంపాదించుకొంటూ, నా బాధను, సంతోషాన్ని వారితో పంచుకొంటూ, ఒక్కోసారి నా ఆక్రోశాన్ని, ఆవేదనని వెల్లగక్కుతూ, నా ఆలోచనలకు ఓ వారధిలా ఈ బ్లాగును ఉపయోగించుకొంటున్నాను. నా మనస్సుకు నచ్చే పనుల్లో ప్రథమ స్థానం: బ్లాగడం అయిపోయింది. ఇదీ ఒక వ్యసనమే అంటూ మా అమ్మా-నాన్న కొన్నిసార్లు బాధపడ్డా, మంచి వ్యసనంలే అని నాకు నేనే సర్దిచెప్పుకొన్నాను.
ఈ రెండేళ్లలో 189 టపాలు, 500 పైగా వ్యాఖ్యలు, 12వేలకు పైగా హిట్లతో నా బ్లాగు కళకళలాడింది. ఈ సందర్భంగా కొన్ని తీపి-చేదు అనుభవాలు మీతో పంచుకోవాలను కొంటున్నాను. 2006లో ఉత్తమ తెలుగు బ్లాగుల్లో మూడో స్థానం రావడం, అదీ శోధన సుధాకర్, గుండెచప్పుడు దిలీప్ బ్లాగుల సరసన నా బ్లాగు ఉండడం చాలా ఆనందం కలిగించిది. ఇక చేదంటారా? సమయాభావం వల్ల బ్లాగులకు దూరంగా ఉన్న సమయమంతా నాకు చేదుగా, బాధగా ఉంటుంది. అప్పట్లో బ్లాగుల రాసి తక్కువ, ఇప్పుడంటే రాసిలోనూ, వాసిలోనూ తెలుగు బ్లాగులకు ఎదురేలేదు. నాకు నచ్చిన, పలువురు మెచ్చిన టపాలు మళ్లీ 'మీ కోసం':-)
రాజకీయం:
ఔరా! 'రైతు' రాజకీయం.
తెలుగు ప్రజా హృదయాధినేత!
రెవ.మార్టిన్ లూథర్ కింగ్ జూ. జన్మదిన శుభాకాంక్షలు!
జ్ఞాపకాలు:
నా తెలుగు రాత!
వేప చెట్టు - చింత చెట్టు.
'కెవిన్ అపుజ్జియొ'...నిజజీవితపు హీరో!
తవికలు:
నీ కళ్ళు...
ఓ హైకూ...
విశ్వ మానవుడు!
అనువాదాలు:
మనిషి ఓ మనిషి !
ప్రియ వసంతమా...!
హాస్యం:
'రానారె' పెళ్లి!
అలనాటి లాప్ టాప్ కం డెస్క్ టాప్...!!!
చరిత్ర:
టి-మెయిలు నుంచి ఈ-మెయిలు దాకా!
లేపాక్షి అందాలు... హిందూపురం చరిత్ర!
50,000 ఏళ్ల క్రిందటి మీ/నా ముత్తాత-ముత్తాత-ముత్తాత....!
సాహిత్యం:
ప్రజాకవి 'వేమన'
ఈద్-ముబారక్, దండయాత్ర , వీడ్కోలు!
చుక్కలకు ఱేడు, వలరాజు మేనమామ - మన చందమామ!
వైద్యం:
నా 100వ టపా - 'థలస్సీమియా'.
ప్రాణం ఖరీదు: వెగెనర్స్ గ్రాన్యులోమటోసిస్!
డాక్టరు పేషెంటైన వేళ... (గుండెపోటు - జాగ్రత్తలు)
{చిత్ర సౌజన్యం:గూగులమ్మ దయ.}
పూర్తిగా చదవండి