సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన విషయమంతా నటీ నటుల ముఖ కవళికల ద్వారా లేదా దృశ్యపరమైన ఇతర అంశాల ద్వారా ప్రేక్షకునికి అర్థమయ్యేలా ఈ సినిమాను రూపొందించాడు కాబట్టే రే అత్యున్నత స్థాయికి ఎదగగలిగారు.

నానాటికీ తరిగిపోతున్న మానవ విలువ నేపధ్యంలో రుపొందించిన ఈ లఘు చిత్రంలో మీకు అర్థం కావలిసిన డైలాగు ఏదైనా వుందంటే అది చివరి సన్నివేశంలో “పీకూ” పాత్రధారి చెప్పే “అమ్మా, తెల్లటి ఈ పుష్పాలను నల్లరంగు పెన్సిల్ తో చిత్రించనా?” అని అడిగే ఒక్క డైలాగు మాత్రమే! నేడే చూడండి.

మొదటి భాగం


రెండో భాగం


మూడో భాగం


పూర్తిగా చదవండి