ప్రేమంటే..
..రెండు హృదయాలు ఒకేలా స్పందించటం,
..ఇద్దరి అభిప్రాయాలు, భావాలు కలవటం.
ఇలాంటివి అప్పటికి చాలా విని ఉన్నాను.
మన పరిచయమైన మొదటి రోజుల్లో ఒకసారి నిన్ను అడిగాను,
“మీకు అన్నిటికన్నా ఏదంటే బాగా ఇష్టం?” (అసంబద్ధం గా, అస్పష్టం గా
ఉందా?ఐనా చూద్దాం ఏం చెప్తావో అని) అసలు ఇసుమంతైనా అలోచించకుండా చాలా అత్మ విశ్వాసం తో చెప్పావు.”నాకు దానిమ్మ పండంటే చాలా ఇస్టం” ఆపలేనంతగా నవ్వానో, నడుస్తూ నవ్వలేక అలాగే ఆగిపోయానో..మొత్తానికి సభ్యత గా ఉండదేమో అని అపేశాక నాకు ఎదురు ప్రశ్న [...]
పూర్తిగా చదవండి