హైదరబాదులో బీచ్
Telugu May 29th, 2008
ఈ నెలలో మా అమ్మాయి శుభద రెండు సార్లు విశాఖపట్నం వెళ్ళొచ్చింది. మా మేనమామ ఇల్లు ఉడా పార్కు దగ్గర కావడంతో రోజూ సాయంత్రం రామకృష్ణా బీచికి వెళ్ళి అక్కడ నీళ్ళల్లోను, ఇసకలోను ఆడడం అలవాటైంది. ఇప్పుడు హైదరాబాదుకి తిరిగొచ్చాక, రోజు ఒకటే గోల......బీచికి తీసుకెళ్ళమని. ఇక్కడ బీచి లేదమ్మా అంటే వినదాయె .
పూర్తిగా చదవండి
సరే అలాగే తీసుకెడ్తానంటూ, అప్పట్లో బీచ్ వాలీబాల్ పోటీలు జరిగిన నెక్లస్ రోడ్ ప్రాంతానికి తీసుకెళ్ళాను. ఆ ప్రాంతమంతా దుర్వాసనతో నిండిఉంది. "చీ, కంపు ఇది బీచి కాదు" అంటూ మా పాప నసగడం మొదలుపెట్టింది.
"బీచికి తీసుకెళ్ళు నాన్నా" అంటూ ఒకటే గోల......శుభద దృష్టిని బీచ్ పై నుంచి మళ్ళించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
కాంగ్రెస్, తెలుగు దేశం, టి.ఆర్.ఎస్, లోక్ సత్తా, బిజేపి, కమ్యూనిస్టు పార్టీలు... ఎవరైనా సరే... హైదరబాదులో బీచిని ఏర్పాటు చేసే వాళ్ళకే నా వోటు.....
పూర్తిగా చదవండి