Cinema is Truth 24fps
Telugu July 4th, 2008హంగరీ దేశానికి చెందిన Bela Tarr తన సినిమాల్లో ఎక్కువ నిడివి గల షాట్లు ఉపయోగించి ప్రేక్షకులకు బోరు కొట్టిస్తాడని ఒక అపవాదు వుంది. కానీ నా దృష్టిలో అది కేవలం అపవాదు మాత్రమే. అందులో ఏ మాత్రం నిజం లేదు. ఒక సీను long shot లో చిత్రీకరించ వచ్చు, లేదా closeup లో చిత్రీకరించవచ్చు. అలాగే ఒక షాట్ long take లో తీయవచ్చు లేదా వివిధ కోణాల్లో, వివిధ పాత్రల points of view పరంగా చిత్రీకరించి ఎడిటింగ్ సమయంలో మనక్కావలసిన పధ్ధతిలో ఏర్చి కూర్చవచ్చు. సినిమా చిత్రీకరణలో ఫలానా పధ్ధతి మాత్రమే సరైనదని చెప్పడం కష్టం గానీ Bela Tarr దర్శకత్వం వహించిన లఘు చిత్రం ఒకటి చూస్తే, ఆయన సినిమాల్లో షాట్ల నిడివి ఎందుకు అంత పొడిగించినట్టుంటుందో అర్థమవుతుంది.
Europe కి చెందిన అన్ని దేశాల నుంచి 5 నిమిషాల నిడివి గల ఒక్కొక్క లఘుచిత్రం ఎన్నిక చేసుకుని, వాటన్నింటినీ Visions of Europe అనే ఒక series ద్వారా 2004 లో చాలా film festivals లో ప్రదర్శింపబడింది. ఈ series లో భాగంగానే Bela Tarr తీసిన The Prologue లో 5 నిమిషాలపాటు ఒకే షాట్లో సినిమా మొదలయ్యి ముగుస్తుంది. కథా పరంగా ఈ సినిమా లో పెద్ద కథేమీ లేదు. జానెడు పొట్ట నింపుకోవడం కోసం రేషన్ షాపు దగ్గర కిలోమీటరు క్యూ లో నిల్చుని వున్న హంగరీ దేశస్తుల దీన స్థితిని ఈ సినిమా ద్వారా మన కళ్ళముందుంచుతారు Bela Tarr.
నా దృష్టిలో ఈ సినిమాని single shot లో తీయడంలోని ఉద్దేశం, గంటల తరబడి క్యూలో నిల్చున్న ప్రజల దీన పరిస్థితిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాలంటే యధార్ధాన్ని ఉన్నదున్నట్టు చూపించడమే కాకుండా time మరియు space కి ప్రాముఖ్యత కల్పించాలి. Time మరియు space కి ఉన్న నిరంతరత ని single take ద్వార మాత్రమే నివేదించ వచ్చని నా అభిప్రాయం. Cinema is truth 24 frames per second అన్నాడు Godard, ఆ మాటలను ఖచ్చితంగా నిరూపిస్తున్న వారిలో Bela Tarr ముందుంటాడు. సాక్ష్యం కావాలంటే Visions of Europe - The Prologue సినిమా చూడండి మీకే తెలుస్తుంది.
పూర్తిగా చదవండి