డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం. అక్షరాలకు ప్రాణం ఉండదు. అవి శబ్దాలకు కేవలం సూచకాలు మాత్రమే; ఉచ్చారణకు కొంతవరకే తోడ్పడతాయి కాని హావభావాలను పలికించలేవు. అందుకే ప్రతిభావంతులైన నటులు పసలేని నాటక సంభాషణకుకూడా ప్రాణం పోస్తూ ఉంటారు. నిత్యజీవితం మాటకొస్తే “దేవుని ఎదుట ప్రమాణంచేసి [...]
పూర్తిగా చదవండి