– విశ్వకవి రవీంద్రుని ‘Stray birds’కు స్వేచ్ఛానువాదం: రవి భగవంతుడి శక్తి మలయమారుతానిది. ఝంఝామారుతానిది కాదు. విశ్వం బాధతో నా ఆత్మను చుంబించి, సాంత్వన కోసం నా గానాన్ని కోరింది. ఓ స్త్రీ! నీ నవ్వులో జీవితమనే జలధారలోని సంగీతం ఉంది. జీవితపు ఆనందం గ్రీష్మంలో పూచే పూలలోనూ, శిశిరం లో రాలే ఆకులలోనూ ప్రక్షిప్తం. నీకు ఆకలి లేదని, భోజనాన్ని నిందించకు. నువ్వు చిరునవ్వు నవ్వి శూన్యం గురించి మాట్లాడేవు. అందుకోసమేనేమో నా నిరీక్షణ అని నాకనిపించింది. తర్కపూరిత చిత్తం కత్తితో సమానం. ఉపయోగించే చేతికది చేస్తుంది గాయం. మనం ప్రపంచాన్ని వక్ర దృష్టి [...]
పూర్తిగా చదవండి