Jul 09
పశ్చిమ దేశాలకీ మనకీ మధ్య సాంస్కృతిక వైరుధ్యాలు.
Telugu నాగరాజా
ప్రాచీన కాలం నుండి భారత దేశం తనదయిన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంది. భారతీయుల జీవన విధానం, ప్రకృతికి అనుగుణంగా వారు నిర్మించుకున్న తమదయిన ప్రత్యేక జీవన శైలి, అప్పటి పశ్చిమ దేశాల్లో ప్రజలని భారత దేశం వైపు ఆకర్షితమయ్యేలా చేసింది. చరిత్రకందని కాలం నుండి ఇప్పటి వరకు భారతీయ సంస్కృతి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలుపుకుంటూ, అనేక రకాలయిన ప్రజలు, వివిధ రకాలయిన భాషలు, భిన్న రకాలయిన వాతావరణం ఇవన్ని కలసి మన దేశానికి ఉపఖండం అనే పేరుని సార్ధకం చేసాయి. ఇంత వైవిధ్యమయిన దేశం ప్రపంచంలో మరెక్కడ ఉండదనడం అతిశయోక్తి కాదు. ఇన్ని రకాలయిన వైరుధ్యాలున్నప్పటికీ, అందరమూ ఒకే దేశంగా కలిసే ఉంటాము. దీనికి మూల కారణం మనందరి ఆలోచనల్లో వున్న పాజిటివ్ థింకింగ్. మనం చేసే ఏ పనయినా ఇతరులకు నష్టం కలిగించకూడదనే చూస్తాము. అదే సమయంలో ప్రకకృతికి దగ్గరగా ఉండేలా చూసుకుంటాము. దానివల్ల వ్యక్తిగా ప్రతీ ఒక్కరు సుఖంగా ఉంటారు, ప్రకృతికి హాని చేయ్యకుండాను ఉంటారు.మా నాన్నగారు ఎప్పుడూ పుట్టిన రోజు ఫంక్షన్లకి గాని, మరే సందర్భంలోనూ ...
పూర్తిగా చదవండి
పూర్తిగా చదవండి