Can't see Telugu? Learn here. More Questions? Ask here.

ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే (Part 1)

Telugu నాగరాజా
ఈ మధ్య సినిమాలలో ఒక విషయం స్పష్టంగా చెపుతున్నారు. హీరో తను ప్రేమించిన అమ్మాయి కోసం, తన ముచ్చట తీర్చడం కోసం అడ్డమయిన అగచాట్లు పడతాడు. అప్పటి వరకు ఆవారాగా తిరిగేసిన మన హీరో, ఎప్పుడయితే హీరోయిన్‌తో పరిచయమయిందో, ఆ అమ్మాయిని ప్రేమించానని డిసైడ్ అయిపోయేడో, ఇక చూడండి, తను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నది కూడా గుర్తుకురాదు. లేదా, నక్సలైట్లలో చేరి కూడా వెనక్కి వచ్చేస్తాడు. హీరోయిన్ కోరిక తీర్చడమో, లేక ఆమెకున్న కష్టాల్ని తొలగించడానికో తన జీవితాన్నే త్యాగం చేసేస్తాడు. వచ్చీరాని తెలుగు మాట్లాడే విలన్ గాడితో ఇష్టం వచ్చినట్లు ఫైట్లు అవీ చేసేస్తాడు. చివరికి కధ సుఖాంతమవుతుంది, హీరొ, హీరోయిన్ ఒకటవుతారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుని బయటకి వచ్చేస్తారు. ఇది మామూలుగా సినిమా కధ. అక్కడితో దీనికి శుభం కార్డ్ పడిపోతుంది.చాలా మంది అనుకుంటున్నట్లు నిజానికి అది ముగింపు కాదు. పెళ్ళయిన తరువాతే మన హీరోకి అసలు కష్టాలు మొదలవుతాయి. మీరు గమనించారో లేదో, హీరోకి పెళ్ళయిన తరువాత ఏమి జరుగుతుంది అనే పాయింటు మీద ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క ...
పూర్తిగా చదవండి

బెంగళూరు పేలుళ్ళు

Telugu Raj
బెంగళూరు నగరంలో నిన్న జరిగిన పేలుళ్ళు ఇద్దరిని బలి తీసుకున్నాయి. ఈ ఘాతుకానికి కారణమెవరో తెలి...
పూర్తిగా చదవండి
Entries RSS Comments RSS